టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ భారత టీ20 జట్టు సారధి సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్ ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు (టీ20ల్లో) బాదిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది.
స్కై 2022లో 41 ఇన్నింగ్స్‌ల్లో 85 సిక్సర్లు (టీ20ల్లో) బాదగా.. అభిషేక్ ఈ ఏడాది కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే 87 సిక్సర్లు కొట్టాడు. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ అగ్రస్థానంలో ఉండగా.. స్కై వరుసగా రెండు, మూడు స్థానాల్లో (2023లో 71 సిక్సర్లు) ఉన్నాడు.
క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్లు
అభిషేక్ శర్మ (38 ఇన్నింగ్స్‌ల్లో 87 సిక్సర్లు, 2024)
సూర్యకుమార్ యాదవ్ (41 ఇన్నింగ్స్‌ల్లో 85 సిక్సర్లు, 2022)
సూర్యకుమార్ యాదవ్ (33 ఇన్నింగ్స్‌ల్లో 71 సిక్సర్లు, 2023)
రిషబ్ పంత్ (31 ఇన్నింగ్స్‌ల్లో 66 సిక్సర్లు, 2018)
శ్రేయస్ అయ్యర్ (42 ఇన్నింగ్స్‌ల్లో 63 సిక్సర్లు, 2019)
సంజూ శాంసన్ (32 ఇన్నింగ్స్‌ల్లో 60 సిక్సర్లు, 2024)
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ సూర్యకుమార్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 11 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా ఉర్విల్ పటేల్ (గుజరాత్) రికార్డును సమం చేశాడు. ఉర్విల్ కూడా ఇదే సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఫాసెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మేఘాలయ ఇన్నింగ్స్‌లో అర్పిత్ భటేవారా (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. అభిషేక్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 9.3 ఓవరల్లోనే విజయతీరాలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment