ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరికీ సాధ్యం కాని ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ మరో 18 సిక్సర్లు బాదితే టీ20ల్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు 148 మ్యాచ్‌ల్లో 182 సిక్సర్లు కొట్టి, టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
రోహిత్ తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (122 మ్యాచ్‌ల్లో 173 సిక్సర్లు) పేరిట ఉంది. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (125), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (124), టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (123) వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. 117 సిక్సర్లతో విరాట్ కోహ్లి తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
కాగా, జనవరి 11 (మొహాలీ), 14 (ఇండోర్), 17 (బెంగళూరు) తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. భారత్ తరఫున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాలాకాలం తర్వాత టీ20ల్లో బరిలోకి దిగుతున్నారు.
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
అఫ్గనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment