విజయ్ హజారే ట్రోఫీ 2023లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, రాజస్థాన్ జట్లు విదర్భ, ముంబై, బెంగాల్, కేరళ జట్లపై విజయాలు సాధించి ఫైనల్ ఫోర్‌కు అర్హత సాధించాయి.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు చెందిన మహిపాల్ లోమ్రార్ (122 నాటౌట్, కేరళపై), బెంగాల్‌కు చెందిన షాబాజ్ అహ్మద్ (100, హర్యానా), హర్యానాకు చెందిన అంకిత్ కుమార్ (102, బెంగాల్‌పై), తమిళనాడు చెందిన బాబా ఇంద్రజిత్ (103 నాటౌట్, ముంబైపై) శతకాలతో చెలరేగగా.. హర్యానాను చెందిన యుజ్వేంద్ర చహల్ (10-0-37-4, బెంగాల్‌పై), కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్ వైశాక్ (8.5-2-44-4, విదర్భపై), రాజస్థాన్‌కు చెందిన అనికేత్ చౌదరీ (7-1-26-4, కేరళపై) బంతితో రాణించారు.
డిసెంబర్ 13న జరిగే తొలి సెమీఫైనల్లో హర్యానా, తమిళనాడు.. డిసెంబర్ 14న జరిగే రెండో సెమీఫైనల్లో రాజస్థాన్, కర్ణాటక జట్లు తలపడనున్నాయి. రెండు సెమీఫైనల్స్‌లో విజేతలు డిసెంబర్ 16న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల స్కోర్ల వివరాలు..
తొలి క్వార్టర్ ఫైనల్:
బెంగాల్ 225 (50 ఓవర్లు)
హర్యానా 226/6 (45.1 ఓవర్లు)
4 వికెట్ల తేడాతో హర్యానా విజయం
రెండో క్వార్టర్ ఫైనల్:
రాజస్థాన్ 267/8 (50 ఓవర్లు)
కేరళ 67/9 (21 ఓవర్లు)
200 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం
మూడో క్వార్టర్ ఫైనల్:
విదర్భ 173 (42 ఓవర్లు)
కర్ణాటక 177/3 (40.3 ఓవర్లు)
7 వికెట్ల తేడాతో కర్ణాటక విజయం
నాలుగో క్వార్టర్ ఫైనల్:
ముంబై 227 (48.3 ఓవర్లు)
తమిళనాడు 229/3 (43.2 ఓవర్లు)
7 వికెట్ల తేడాతో తమిళనాడు విజయం
Comments
Please login to add a commentAdd a comment