Mahipal Lomror
-
ఆర్సీబీ వదిలేసింది.. ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు..!
రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు మహిపాల్ లోమ్రార్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (360 బంతుల్లో 300; 25 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు టీ విరామం సమయానికి రాజస్థాన్ స్కోర్ 660/7గా ఉంది. లోమ్రార్‌తో పాటు కుక్నా అజయ్ సింగ్ (40) క్రీజ్‌లో ఉన్నాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో లోమ్రార్‌కు జతగా మరో ఆటగాడు సెంచరీ చేశాడు. కార్తీక్ శర్మ 115 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. టెయిలెండర్లు భరత్ శర్మ 54, దీపక్ చాహర్ 35 పరుగులు చేయగా.. అభిజిత్ తోమర్ 20, రామ్మోహన్ చౌహాన్ 29, జుబైర్ అలీ ఖాన్ 26, దీపక్ హూడా 10 పరుగులు చేశాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో దీపక్ దాపోలా, స్వప్నిల్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకిత్ మనోర్, అభయ్ నేగి, అవనీశ్ సుధ తలో వికెట్ దక్కించుకున్నారు.ఆర్సీబీ వదిలేసింది.. ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు..!24 ఏళ్ల మహిపాల్ లోమ్రార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇటీవల వదిలేసింది. 2025 ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో లోమ్రార్‌కు చోటు దక్కలేదు. ఆర్సీబీ వదిలేసిందన్న కసితో చెలరేగిపోయిన లోమ్రార్ ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో లోమ్రార్ మరెన్ని పరుగులు చేస్తాడో వేచి చూడాలి. లోమ్రార్ ఆర్సీబీ వదిలేసిన నాటి నుంచి కసితో రగిలిపోతున్నాడు. తాజా ట్రిపుల్ సెంచరీకి ముందు మ్యాచ్‌లో లోమ్రార్ సెంచరీ చేశాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 111 పరుగులు చేశాడు. ఇదే రంజీ సీజన్లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ లోమ్రార్ చెలరేగి ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. లోమ్రార్ అరివీర భయంకర ఫామ్‌ను చూసి ఆర్సీబీ అతన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేస్తుందేమో వేచి చూడాలి. లోమ్రార్‌ను ఆర్సీబీ 2022 సీజన్లో 95 లక్షలకు దక్కించుకుంది. లోమ్రార్ 2018లో ఐపీఎల్ అరంగేట్రం చేసి వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. -
IPL RCB Vs MI: బుమ్రా కళ్లు చెదిరే యార్కర్.. బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు. తన సహాచర బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికి బుమ్రా మాత్రం తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా అద్బుతమైన యార్కర్‌తో మెరిశాడు. సంచలన బంతితో బెంగళూరు బ్యాటర్ మహిపాల్ లోమ్రోర్ను బుమ్రా బోల్తా కొట్టించాడు. బుమ్రా వేసిన బంతికే లామ్రోర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన బుమ్రా.. నాలుగో బంతిని లెగ్ స్టంప్ టార్గెట్ చేస్తూ యార్కర్ సంధించాడు. ఈ క్రమంలో లోమ్రోర్ తన బ్యాట్‌తో బంతిని ఆపేలోపే నేరుగా వెళ్లి ప్యాడ్‌కు తాకింది. బుమ్రా ఎల్బీకి అప్పీలు చేయగా అంపైర్ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. లోమ్రోర్ రివ్యూ తీసుకున్నప్పటికి ఫలితం మాత్రం శూన్యం. రిప్లేలో బంతి క్లియర్‌గా లెగ్ స్టంప్‌కు తాకుతున్నట్లు తేలింది. దీంతో లోమ్రోర్ గోల్డెన్ డక్‌గా మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. pic.twitter.com/vjWj2R8FAc — Sitaraman (@Sitaraman112971) April 11, 2024 -
RCB: ఫామ్‌లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు?
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహిపాల్ లామ్రోర్‌కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా శనివారం రాజస్తాన్‌తో తలపడ్డ ఆర్సీబీకి భంగపాటు తప్పలేదు. జైపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్లో నాలుగో ఓటమి నమోదు చేసింది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113)తో వృథాగా పోగా.. జోస్ బట్లర్ సెంచరీ(100- నాటౌట్) రాజస్తాన్‌ను గెలిపించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ బ్యాటర్ సౌరవ్ చౌహాన్ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అయితే అరంగేట్రంలో ఈ గుజరాత్ ఆటగాడు ప్రభావం చూపలేకపోయాడు. #ICYMI Local lad and our brilliant leggie, Himanshu 🔁 Saurav#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB pic.twitter.com/05BczWmHJh — Royal Challengers Bengaluru (@RCBTweets) April 6, 2024 సౌరవ్ అరంగేట్రంలో ఇలా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసిన లెఫ్టాండర్ సౌరవ్.. యజువేంద్ర చహల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా నామినేట్ చేసిన మహిపాల్ లామ్రోర్ సేవలను ఉపయోగించుకోలేకపోయింది ఆర్సీబీ. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 ఫామ్‌లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు? ఈ విషయంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ ఆర్సీబీ వ్యూహాలపై పెదవి విరిచాడు. ‘‘ దేశవాళీ క్రికెట్లో మహిపాల్ లామ్రోర్ ఈ పిచ్‌పై ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఈరోజు అతడికి ఆర్సీబీ తుదిజట్టులో చోటు కల్పించలేదు. అతడు ఫామ్‌లోనే ఉన్నాడు కూడా! అయినా ఇలా ఎందుకు చేశారో తెలియదు. భారత కోచ్‌లు కూడా ఐపీఎల్ విషయాల్లో కాస్త జోక్యం చేసుకుంటే.. ఇలాంటి ప్రాథమిక తప్పిదాలు జరగవు. ప్రతిభ ఉన్నవాళ్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయన్న దానికి ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన లామ్రోర్ కాగా రాజస్తాన్‌లోని నాగౌర్‌కు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్‌లో 32 మ్యాచ్‌లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 452 పరుగులు చేశాడు. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన అతడు ఒక వికెట్ కూడా తీశాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీబీ సాధించిన ఒకే ఒక్క విజయం(పంజాబ్‌పై)లోనూ లామ్రోర్ కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేవలం 8 బంతుల్లోనే 17 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే 33 రన్స్ చేశాడు. రాజస్తాన్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►వేదిక: జైపూర్.. సవాయి మాన్సింగ్ స్టేడియం ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►ఆర్సీబీ స్కోరు: 183/3 (20) ►రాజస్తాన్ స్కోరు: 189/4 (19.1) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై రాజస్తాన్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(రాజస్తాన్). చదవండి: Virat Kohli: స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే -
చహల్ మ్యాజిక్.. శతక్కొట్టిన లోమ్రార్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, రాజస్థాన్ జట్లు విదర్భ, ముంబై, బెంగాల్, కేరళ జట్లపై విజయాలు సాధించి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు చెందిన మహిపాల్ లోమ్రార్ (122 నాటౌట్, కేరళపై), బెంగాల్‌కు చెందిన షాబాజ్ అహ్మద్ (100, హర్యానా), హర్యానాకు చెందిన అంకిత్ కుమార్ (102, బెంగాల్‌పై), తమిళనాడు చెందిన బాబా ఇంద్రజిత్ (103 నాటౌట్, ముంబైపై) శతకాలతో చెలరేగగా.. హర్యానాను చెందిన యుజ్వేంద్ర చహల్ (10-0-37-4, బెంగాల్‌పై), కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్ వైశాక్ (8.5-2-44-4, విదర్భపై), రాజస్థాన్‌కు చెందిన అనికేత్ చౌదరీ (7-1-26-4, కేరళపై) బంతితో రాణించారు. డిసెంబర్ 13న జరిగే తొలి సెమీఫైనల్లో హర్యానా, తమిళనాడు.. డిసెంబర్ 14న జరిగే రెండో సెమీఫైనల్లో రాజస్థాన్, కర్ణాటక జట్లు తలపడనున్నాయి. రెండు సెమీఫైనల్స్‌లో విజేతలు డిసెంబర్ 16న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల స్కోర్ల వివరాలు.. తొలి క్వార్టర్ ఫైనల్: బెంగాల్ 225 (50 ఓవర్లు) హర్యానా 226/6 (45.1 ఓవర్లు) 4 వికెట్ల తేడాతో హర్యానా విజయం రెండో క్వార్టర్ ఫైనల్: రాజస్థాన్ 267/8 (50 ఓవర్లు) కేరళ 67/9 (21 ఓవర్లు) 200 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం మూడో క్వార్టర్ ఫైనల్: విదర్భ 173 (42 ఓవర్లు) కర్ణాటక 177/3 (40.3 ఓవర్లు) 7 వికెట్ల తేడాతో కర్ణాటక విజయం నాలుగో క్వార్టర్ ఫైనల్: ముంబై 227 (48.3 ఓవర్లు) తమిళనాడు 229/3 (43.2 ఓవర్లు) 7 వికెట్ల తేడాతో తమిళనాడు విజయం -
తొలి ఫిఫ్టీ.. ఐదేళ్ల క్రితం అరంగేట్రం, గిల్‌క్రిస్ట్‌కు వీరాభిమాని
ఆర్సీబీ ఆల్‌రౌండర్ మహిపాల్ లామ్రోర్ ఐపీఎల్లో తొలి అర్థసెంచరీ సాధించాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. కోహ్లితో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించిన మహిపాల్ లామ్రోర్ 29 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే మహిపాల్ లామ్రోర్ 2018లోనే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అయితే ఐదేళ్లకు గానూ ఐపీఎల్లో అర్థసెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఇక మహిపాల్ లామ్రోర్ ఆస్ట్రేలియా మాజీ విధ్వంకర ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు వీరాభిమాని. అతని విధ్వంసకర ఆటతీరును చూస్తూ పెరిగిన లామ్రోర్ ఇవాళ దేశవాలీ క్రికెట్లో తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఈ సీజన్లో దేశవాలీ క్రికెట్లో లామ్రోర్ వరుసగా 69, 55, 46, 85, 101 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 95 లక్షలకు మహిపాల్ లామ్రోర్‌ను దక్కించుకుంది. Mahipal Lom-ROAR🔥#DCvRCB #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @RCBTweets pic.twitter.com/j6KNm2pEU9 — JioCinema (@JioCinema) May 6, 2023 Lomror was 10*(9) at the end of the 13th over. Lomror finished on 54*(29) after the 20th over. One of the best knocks by an uncapped player in IPL 2023. pic.twitter.com/fY1bzlNLR4 — Johns. (@CricCrazyJohns) May 6, 2023 చదవండి: కోహ్లి అరుదైన ఫీట్.. రికార్డులు కొట్టడానికే పుట్టాడా? -
మహిపాల్‌ను దూషించిన సిరాజ్! ఇప్పటికే రెండుసార్లు సారీ చెప్పాను.. పర్లేదు భాయ్!
IPL 2023 RCB Vs RR- Mohammed Siraj- Mahipal Lomror: తన బౌలింగ్‌లో బ్యాటర్లు చితక్కొట్టినా.. మిస్ ఫీల్డింగ్ కారణంగా కీలక సమయంలో తన ఓవర్లో ప్రత్యర్థి ఎక్కువ పరుగులు రాబట్టినా.. సదరు బౌలర్‌కు ఫ్రస్టేషన్ ఏ రేంజ్లో ఉంటుందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఆదివారం ఇదే పరిస్థితి ఎదురైంది. ఆర్సీబీ విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ ఆటగాళ్లు ఆఖరి వరకు పట్టుదలగా నిలబడ్డారు. ఈ క్రమంలో 19వ ఓవర్లో కెప్టెన్ విరాట్ కోహ్లి.. సిరాజ్‌కు బంతినిచ్చాడు. అప్పటికి రవిచంద్రన్ అశ్విన్, ధ్రువ్ జురెల్ క్రీజులో ఉన్నారు. ఆ ఓవర్లో సిరాజ్ మొదటి బంతికి అశ్విన్ ఒక పరుగు తీశాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో ధ్రువ్ మొదట 2, అనంతరం ఒక పరుగు రాబట్టాడు. తర్వాత అశ్విన్ ఒక రన్ తీయగా.. ధ్రువ్ జురెల్ మరుసటి బంతికి సిక్సర్ బాదాడు. కోపంతో స్టంప్స్‌ను తన్ని ఇక ఆఖరి బాల్‌కు ధ్రువ్ జురెల్- అశ్విన్ కలిసి రెండు పరుగులు పూర్తి చేశారు. ఇది సిరాజ్ కోపానికి కారణమైంది. లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆర్సీబీ ఆటగాడు మహిపాల్ లామ్రోర్ వేగంగా కదలకపోవడం వల్లే ఇలా జరిగిందన్నట్లు సిరాజ్ కోపంతో ఊగిపోయాడు. స్టంప్స్‌ను తంతూ లామ్రోర్‌ను దూషించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా సిరాజ్‌ను విమర్శించారు కొంతమంది నెటిజన్లు. ఈ నేపథ్యంలో సిరాజ్.. లామ్రోర్‌కు క్షమాపణ చెప్పిన వీడియోను ఆర్సీబీ తమ అధికారిక యూట్యూబ్ చానెల్లో షేర్ చేయగా తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. రెండుసార్లు సారీ చెప్పాను ‘‘నాకు అప్పుడు బాగా కోపం వచ్చింది. సారీ.. ఇప్పటికే అతడికి రెండుసార్లు క్షమాపణ చెప్పాను. నిజానికి నా కోపమంతా మైదానం వరకే పరిమితం. ఆఫ్ ఫీల్డ్‌లో సరదాగా ఉంటా. మ్యాచ్ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది’’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు. మరేం పర్లేదు భాయ్ ఇందుకు బదులుగా.. ‘‘మరేం పర్లేదు సిరాజ్ భాయ్. కీలక మ్యాచ్‌లలో కీలక సమయంలో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి’’ అని క్రీడాస్ఫూర్తిని చాటాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సొంతమైదానంలో ఆర్సీబీ.. రాజస్తాన్ రాయల్స్ మీద 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన సిరాజ్ 39 పరుగులు ఇచ్చాడు. జోస్ బట్లర్ రూపంలో కీలక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: ప్రేమ విషయం పేరెంట్స్‌కు చెప్పలేనన్న సచిన్! అంజలి అంతటి త్యాగం చేసిందా? జట్టు నిండా విధ్వంసకర వీరులే.. అయినా గెలుపు కోసం అష్టకష్టాలు..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });