తొలి ఫిఫ్టీ.. ఐదేళ్ల క్రితం అరంగేట్రం, గిల్‌క్రిస్ట్‌కు వీరాభిమాని | Mahipal Lomror Maiden IPL Half Century Vs DC Match | Sakshi
Sakshi News home page

#MahipalLomror: తొలి ఫిఫ్టీ.. ఐదేళ్ల క్రితం అరంగేట్రం, గిల్‌క్రిస్ట్‌కు వీరాభిమాని

Published Sat, May 6 2023 10:46 PM | Last Updated on Sat, May 6 2023 10:52 PM

Mahipal Lomror Maiden IPL Half Century Vs DC Match - Sakshi

Photo: IPL Twitter

ఆర్‌సీబీ ఆల్‌రౌండర్‌ మహిపాల్‌ లామ్రోర్‌  ఐపీఎల్‌లో తొలి అర్థసెంచరీ సాధించాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ సాధించాడు. కోహ్లితో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించిన మహిపాల్‌ లామ్రోర్‌ 29 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అయితే మహిపాల్‌ లామ్రోర్‌ 2018లోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అయితే ఐదేళ్లకు గానూ ఐపీఎల్‌లో అర్థసెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఇక మహిపాల్‌ లామ్రోర్‌ ఆస్ట్రేలియా మాజీ విధ్వంకర ఓపెనర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌కు వీరాభిమాని. అతని విధ్వంసకర ఆటతీరును చూస్తూ పెరిగిన లామ్రోర్‌ ఇవాళ దేశవాలీ క్రికెట్‌లో తన మార్క్‌ను చూపిస్తున్నాడు.

ఈ సీజన్‌లో దేశవాలీ క్రికెట్‌లో లామ్రోర్‌ వరుసగా 69, 55, 46, 85, 101 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రూ. 95 లక్షలకు మహిపాల్‌ లామ్రోర్‌ను దక్కించుకుంది.

చదవండి: కోహ్లి అరుదైన ఫీట్‌.. రికార్డులు కొట్టడానికే పుట్టాడా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement