రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు మహిపాల్ లోమ్రార్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (360 బంతుల్లో 300; 25 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు టీ విరామం సమయానికి రాజస్థాన్ స్కోర్ 660/7గా ఉంది. లోమ్రార్‌తో పాటు కుక్నా అజయ్ సింగ్ (40) క్రీజ్‌లో ఉన్నాడు.
రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో లోమ్రార్‌కు జతగా మరో ఆటగాడు సెంచరీ చేశాడు. కార్తీక్ శర్మ 115 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. టెయిలెండర్లు భరత్ శర్మ 54, దీపక్ చాహర్ 35 పరుగులు చేయగా.. అభిజిత్ తోమర్ 20, రామ్మోహన్ చౌహాన్ 29, జుబైర్ అలీ ఖాన్ 26, దీపక్ హూడా 10 పరుగులు చేశాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో దీపక్ దాపోలా, స్వప్నిల్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకిత్ మనోర్, అభయ్ నేగి, అవనీశ్ సుధ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఆర్సీబీ వదిలేసింది.. ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు..!
24 ఏళ్ల మహిపాల్ లోమ్రార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇటీవల వదిలేసింది. 2025 ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో లోమ్రార్‌కు చోటు దక్కలేదు. ఆర్సీబీ వదిలేసిందన్న కసితో చెలరేగిపోయిన లోమ్రార్ ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో లోమ్రార్ మరెన్ని పరుగులు చేస్తాడో వేచి చూడాలి.
లోమ్రార్ ఆర్సీబీ వదిలేసిన నాటి నుంచి కసితో రగిలిపోతున్నాడు. తాజా ట్రిపుల్ సెంచరీకి ముందు మ్యాచ్‌లో లోమ్రార్ సెంచరీ చేశాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 111 పరుగులు చేశాడు. ఇదే రంజీ సీజన్‌లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ లోమ్రార్ చెలరేగి ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. లోమ్రార్ అరివీర భయంకర ఫామ్‌ను చూసి ఆర్సీబీ అతన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేస్తుందేమో వేచి చూడాలి. లోమ్రార్‌ను ఆర్సీబీ 2022 సీజన్‌లో 95 లక్షలకు దక్కించుకుంది. లోమ్రార్ 2018లో ఐపీఎల్ అరంగేట్రం చేసి వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment