మహిపాల్- సిరాజ్ (PC: RCB/Youtube)
IPL 2023 RCB Vs RR- Mohammed Siraj- Mahipal Lomror: తన బౌలింగ్‌లో బ్యాటర్లు చితక్కొట్టినా.. మిస్ ఫీల్డింగ్ కారణంగా కీలక సమయంలో తన ఓవర్లో ప్రత్యర్థి ఎక్కువ పరుగులు రాబట్టినా.. సదరు బౌలర్‌కు ఫ్రస్టేషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఆదివారం ఇదే పరిస్థితి ఎదురైంది.
ఆర్సీబీ విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ ఆటగాళ్లు ఆఖరి వరకు పట్టుదలగా నిలబడ్డారు. ఈ క్రమంలో 19వ ఓవర్లో కెప్టెన్ విరాట్ కోహ్లి.. సిరాజ్‌కు బంతినిచ్చాడు. అప్పటికి రవిచంద్రన్ అశ్విన్, ధ్రువ్ జురెల్ క్రీజులో ఉన్నారు.
ఆ ఓవర్లో సిరాజ్ మొదటి బంతికి అశ్విన్ ఒక పరుగు తీశాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో ధ్రువ్ మొదట 2, అనంతరం ఒక పరుగు రాబట్టాడు. తర్వాత అశ్విన్ ఒక రన్ తీయగా.. ధ్రువ్ జురెల్ మరుసటి బంతికి సిక్సర్ బాదాడు.
కోపంతో స్టంప్స్‌ను తన్ని
ఇక ఆఖరి బాల్‌కు ధ్రువ్ జురెల్- అశ్విన్ కలిసి రెండు పరుగులు పూర్తి చేశారు. ఇది సిరాజ్ కోపానికి కారణమైంది. లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆర్సీబీ ఆటగాడు మహిపాల్ లామ్రోర్ వేగంగా కదలకపోవడం వల్లే ఇలా జరిగిందన్నట్లు సిరాజ్ కోపంతో ఊగిపోయాడు.
స్టంప్స్‌ను తంతూ లామ్రోర్‌ను దూషించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా సిరాజ్‌ను విమర్శించారు కొంతమంది నెటిజన్లు. ఈ నేపథ్యంలో సిరాజ్.. లామ్రోర్‌కు క్షమాపణ చెప్పిన వీడియోను ఆర్సీబీ తమ అధికారిక యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేయగా తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.
రెండుసార్లు సారీ చెప్పాను
‘‘నాకు అప్పుడు బాగా కోపం వచ్చింది. సారీ.. ఇప్పటికే అతడికి రెండుసార్లు క్షమాపణ చెప్పాను. నిజానికి నా కోపమంతా మైదానం వరకే పరిమితం. ఆఫ్ ఫీల్డ్‌లో సరదాగా ఉంటా. మ్యాచ్ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది’’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు.
మరేం పర్లేదు భాయ్
ఇందుకు బదులుగా.. ‘‘మరేం పర్లేదు సిరాజ్ భాయ్. కీలక మ్యాచ్‌లలో కీలక సమయంలో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి’’ అని క్రీడాస్ఫూర్తిని చాటాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సొంతమైదానంలో ఆర్సీబీ.. రాజస్తాన్ రాయల్స్ మీద 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన సిరాజ్ 39 పరుగులు ఇచ్చాడు. జోస్ బట్లర్ రూపంలో కీలక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: ప్రేమ విషయం పేరెంట్స్‌కు చెప్పలేనన్న సచిన్! అంజలి అంతటి త్యాగం చేసిందా?
జట్టు నిండా విధ్వంసకర వీరులే.. అయినా గెలుపు కోసం అష్టకష్టాలు..!
Comments
Please login to add a commentAdd a comment