షాబాజ్‌ అహ్మద్‌.. సివిల్‌ ఇంజనీర్‌ నుంచి క్రికెటర్‌ దాకా | Intresting Facts About Shabaz Ahmed Who Plays RCB IPL 2022 | Sakshi
Sakshi News home page

IPL 2022: షాబాజ్‌ అహ్మద్‌.. సివిల్‌ ఇంజనీర్‌ నుంచి క్రికెటర్‌ దాకా

Published Thu, Apr 7 2022 4:53 PM | Last Updated on Thu, Apr 7 2022 8:29 PM

Intresting Facts About Shabaz Ahmed Who Plays RCB IPL 2022 - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2021లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌ గుర్తుంది కదా. ఆ మ్యాచ్‌లో లక్ష్యచేధనలో బెంగళూరు 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. ఈ దశలో దినేశ్‌ కార్తిక్‌(23 బంతుల్లో 44, 7 ఫోర్లు, 1 సిక్సర్‌) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను టర్న్‌ చేయడమే గాక ఆఖరిదాకా నిలిచి జట్టును గెలిపించాడు. అయితే కార్తిక్‌ ఇన్నింగ్స్‌ ఎంత కీలకమో షాబాజ్‌ అహ్మద్‌ ఆడిన ఇన్నింగ్స్‌కు అంతే ప్రాముఖ్యత ఉంటుంది.

26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో షాబాజ్‌ 45 పరుగులు చేశాడు. అయితే కార్తిక్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై అంతా ప్రశంసలు కురిపించారు. కానీ సరైన సహకారం ఉంటేనే ఏ బ్యాట్స్‌మన్‌ అయినా జట్టును గెలిపించగలడు.ఆ సహకారం పేరే షాబాజ్‌ అహ్మద్‌. 21 ఏళ్ల ఈ కుర్రాడు రాజస్తాన్‌ బౌలర్లను ఎదుర్కొన్న తీరు అద్భుతమనే చెప్పొచ్చు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే బ్యాట్స్‌మన్‌ ఎప్పటికి గుర్తుండిపోతాడు. ఆ జాబితాలో షాబాజ్‌ అహ్మద్‌ చేరిపోయాడు. 

►షాబాజ్‌ అహ్మద్‌ పశ్చిమబంగలోని కోల్‌కతా నగరం అతని నివాసం
►ఐపీఎల్‌ ఆడడం అతని కెరీర్‌లో ఇది మూడోసారి. 
►ప్రస్తుతం ఒక ప్రైవేటు యునివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు.
►బెంగాల్‌ రంజీ ట్రోఫీలో ప్రస్తుతం షాబాజ్‌ అహ్మద్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.
►చిన్నప్పుడు ఇంజనీర్‌ కావాలనుకున్న షాబాజ్‌ అహ్మద్‌.. తన స్నేహితులతో కలిసి స్కూల్‌ ఎగ్గొట్టి రంజీ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లేవాడు. అలా అతను క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు.
►2018-19 విజయ్‌ హజారే ట్రోఫీ ద్వారా దేశవాలీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
► 2020లో తొలిసారి ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరపున బరిలోకి దిగాడు. ఆ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు.
►గత ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో షాబాజ్‌ అహ్మద్‌ను మరోసారి ఆర్‌సీబీ కొనుగోలు చేసింది.

చదవండి: Dinesh Karthik: వారెవ్వా కార్తిక్‌.. మరో 'నిదహాస్‌'ను తలపించావు

Shikar Dhawan: 'లవ్‌ ప్రపోజ్‌ చేస్తే రిజెక్ట్‌ చేసింది.. కోహినూర్‌ డైమండ్‌ను మిస్సయ్యావు!'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement