‘ఓవెన్’లో ఉన్నట్టుంది... | Mumbai indians Bowling coach Shane Bond about this summer in india | Sakshi

‘ఓవెన్’లో ఉన్నట్టుంది...

Published Sun, May 31 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

‘ఓవెన్’లో ఉన్నట్టుంది...

‘ఓవెన్’లో ఉన్నట్టుంది...

ఐపీఎల్ కోసం భారత్‌లో గడిపిన రెండు నెలలు ఓవెన్‌లో కూర్చున్నట్లు ఉందని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ చెప్పాడు. లీగ్‌లో చాంపియన్స్‌గా నిలిచిన తర్వాత స్వదేశం న్యూజిలాండ్ వెళ్లిన బాండ్... భారత్‌లో తన బాధలను చెప్పుకొచ్చాడు. ‘బాబోయ్... అదేం వేడి. గతంలో భారత్‌లో ఆడాను. కానీ ఈసారి మాత్రం ఎండలు తట్టుకోలేకపోయాం. ముఖ్యంగా కోల్‌కతాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత, 90 శాతం ఉక్కబోత ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్ వచ్చా క ఒక్కసారిగా హాయిగా అనిపిస్తోంది.

రెండు నెలల తర్వాత స్వెట్టర్ వేసుకున్నాను’ అని బాండ్ చెప్పాడు. అయితే ఇంత ఎండల్లోనూ అభిమానులు చూపించే ఆదరణ భారత్‌లో మాత్రమే దొరుకుతుందని చెప్పాడు. ‘హోటల్‌లో లిఫ్ట్‌లోంచి బయటకు రాగానే అభిమానులు ఫొటోలు తీసుకుంటూ ఉంటారు. బస్‌లో స్టేడియానికి వెళుతుంటే మండుటెండలో కూడా రోడ్లపై బారులుగా నిలబడి ఉంటారు. ఇంత గొప్ప అభిమానం భారత్ లోనే దొరుకుతుంది’ అని బాండ్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement