'నీ లుక్‌ అదుర్స్‌.. పాట డబుల్‌ అదుర్స్'‌ | Hardik Pandya Sings Mumbai Indians Theme Song Becoming Viral | Sakshi
Sakshi News home page

'నీ లుక్‌ అదుర్స్‌.. పాట డబుల్‌ అదుర్స్'‌

Published Thu, Nov 5 2020 9:36 PM | Last Updated on Thu, Nov 5 2020 9:37 PM

Hardik Pandya Sings Mumbai Indians Theme Song Becoming Viral - Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి ఫైనల్‌లో అడుగుపెడుతామని ముంబై ఇండియన్స్‌ ఆటగాడు, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు హోటల్‌ నుంచి బయలుదేరిన హార్ధిక్‌ పాండ్యా గుండుతో దర్శనమిచ్చాడు. పాండ్యా హోటల్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ 2020 థీమ్‌ సాంగ్‌ 'దునియా హలా దేంగే హమ్‌' అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో పాట వినిపించింది. ఆ పాట లిరిక్స్‌ తగ్గట్టూ పాట పాడుకుంటూ హార్దిక్‌ పాండ్యా ఉత్సాహంతో కనిపించాడు. (చదవండి : కోహ్లి.. నువ్వు మరిన్ని సిక్సర్లు కొట్టాలి)

ఇక చివరగా హోటల్‌ బయటకు రాగానే ముంబై ఇండియన్స్‌ జెండాలతో కనిపించిన హోటల్‌ సిబ్బందిని తమ టీమ్‌కు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ 'లోహా జాలా దేంగే' థమ్సప్‌ సింబల్‌ చూపించాడు. ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది. కాగా ఐపీఎల్‌లో ముంబై తాను ఆడిన 11 ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచింది. కాగా హార్ధిక్‌ పాండ్యా ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన పాండ్యా 174 స్ట్రైక్‌రేట్‌తో 241 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే పాండ్యా 20 సిక్సర్లతో రెచ్చిపోయాడు. (చదవండి : బుమ్రా కంటే ‘ఎక్కువే’.. కానీ) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement