దుబాయ్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో రాజస్తాన్‌తో జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో కేకేఆర్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం రాజస్తాన్ 12 పాయింట్లతో ఆరోస్థానంలో ఉండగా, కేకేఆర్ 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఓవరాల్‌గా ఇరుజట్లు 21 సార్లు ముఖాముఖి పోరులో తలపడితే కేకేఆర్ 11సార్లు విజయం సాధించగా, రాజస్తాన్ 10సార్లు గెలుపొందింది.
రాజస్తాన్ ఆడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించగా, కేకేఆర్ ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలనే నమోదు చేసింది. ఈ రెండు జట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్. గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. ఇరుజట్లలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శుబ్‌మన్ గిల్(404-కేకేఆర్), సంజూ శాంసన్(374-రాజస్తాన్), నితీష్ రాణా(352-కేకేఆర్), ఇయాన్ మోర్గాన్(350-కేకేఆర్), స్టీవ్ స్మిత్(307- రాజస్తాన్)లు టాప్ ఫెర్ఫార్లగా ఉన్నారు. ఇక అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో ఆర్చర్(19-రాజస్తాన్), వరుణ్ చక్రవర్తి(15-కేకేఆర్), శ్రేయస్ గోపాల్(9-రాజస్తాన్), ప్యాట్ కమిన్స్(8-కేకేఆర్), రాహుల్ తెవాటియా(7-రాజస్తాన్)లు వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ రోజు మ్యాచ్‌లో ఎవరు గెలిచినా.. ప్లేఆఫ్స్ బెర్తు కోసం మంగళవారం వరకూ వెయిట్ చేయకతప్పదు. ఇంకా సన్‌రైజర్స్ రేసులో ఉండటంతో అప్పటివరకూ నిరీక్షణ తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment