దుబాయ్: రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 192 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శుబ్‌మన్ గిల్(36; 24 బంతుల్లో 6 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి(39; 34 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్స్‌లు), మోర్గాన్( 68 నాటౌట్; 35 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్(25; 11 బంతుల్లో 1 ఫోర్, 3సిక్స్‌లు) ఆకట్టుకోవడంతో కేకేఆర్ గౌరవప‍్రదమైన స్కోరు సాధించింది. రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌ను గిల్, నితీష్ రాణాలు ఆరంభించారు. కాగా, రాణా తాను ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. జోఫ్రా ఆర‍్చర్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆ తరుణంలో గిల్-త్రిపాఠిలు ఇన్నింగ్స్‌ను మరమ్మత్తులు చేశారు. ఈ జోడి 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరిన తర్వాత నరైన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో 74 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్‌ను కోల్పోయింది. మరో 20 పరుగుల వ్యవధిలో త్రిపాఠి ఔట్ కాగా, దినేశ్ కార్తీక్ డకౌట్ అయ్యాడు. కాగా, మోర్గాన్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి రసెల్ కూడా జత కలవడంతో కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. మోర్గాన్ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్ల ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. కమిన్స్ 15 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో తెవాటియా మూడు వికెట్లు సాధించగా, కార్తీక్ త్యాగి రెండు వికెట్లు తీశాడు. ఆర్చర్, శ్రేయస్ గోపాల్‌లు తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment