పోరాడి ఓడిన సన్‌రైజర్స్‌..ఫైనల్‌కు ఢిల్లీ | Delhi Capitals Book Final Berth After Beat SRH By 17 Runs | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సన్‌రైజర్స్‌..ఫైనల్‌కు ఢిల్లీ

Published Sun, Nov 8 2020 11:22 PM | Last Updated on Sun, Nov 8 2020 11:25 PM

Delhi Capitals Book Final Berth After Beat SRH By 17 Runs - Sakshi

అబుదాబి: ఐపీఎల్‌–13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆట ముగిసింది. ఆదివారం ఇక్కడ జరిగిన క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ పోరాడి ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. దాంతో సన్‌రైజర్స్‌ ఇంటిముఖం పట్టగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.  శిఖర్‌ ధావన్‌(78; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు), స్టోయినిస్‌(38; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌)లు మంచి ఓపెనింగ్‌ భాగస్వామ్యంతో పాటు హెట్‌మెయిర్‌( 42 నాటౌట్‌; 22 బంతుల్లో 4 ఫోర్లు,  1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించాడు.

ఇక అయ్యర్‌(21; 20 బంతుల్లో 1 ఫోర్‌), లు ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. అనంతరం టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్‌ వార్నర్‌(2) నిరాశపరిచాడు. రబడా వేసిన రెండో ఓవర్‌ తొలి బంతికి వార్నర్‌ ఔటయ్యాడు. ఇక ప్రియాం గార్గ్‌(17), మనీష్‌ పాండే(21)లు పరుగు తేడాలో ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ కష్టాల్లో పడింది. స్టోయినిస్‌ వేసిన ఐదో ఓవర్‌ నాలుగు, ఆరు బంతులకు గార్గ్‌, పాండేలు ఔట్‌ కావడంతో ఆరెంజ్‌ ఆర్మీ 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో కేన్‌ విలియమ్స్‌(67; 45 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), అబ్దుల్‌ సామద్‌(33; 16 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్‌లు)లు పోరాడినా జట్టును గట్టెంచలేకపోయారు. వీరిద్దరూ ఆడుతున్నంతసేపు మ్యాచ్‌ సన్‌రైజర్స్‌దే అనిపించినా, ఈ జోడి ఔటైన తర్వాత మ్యాచ్‌ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిపోయింది. సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో సన్‌రైజర్స్‌ 8 వికెట్ల నష్టానికి 172పరుగులకే పరిమితం కావడంతో ఓటమి పాలైంది. ఢిల్లీ బౌలర్లలో  రబడా నాలుగు వికెట్లు సాధించగా, స్టోయినిస్‌ మూడు వికెట్లు తీశాడు. అక్షర్‌ పటేల్‌కు వికెట్‌ దక్కింది.మంగళవారం ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ అమీతుమీ తేల్చుకోనుంది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 190 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ను స్టోయినిస్‌, ధావన్‌లు ఆరంభించారు. పృథ్వీ షాకు ఉద్వాసన పలకడంతో ధావన్‌తో కలిసి స్టోయినిస్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. వీరిద్దరూ ఆదినుంచి బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్టోయినిస్‌-ధావన్‌లు పోటీ పరుగులు చేయడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి ఢిల్లీ 65 పరుగులు చేసింది. కాగా, రషీద్‌ ఖాన్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ రెండో బంతికి స్టోయినిస్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో ఢిల్లీ 86 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం ధావన్‌-అయ్యర్‌ల జోడి రన్‌రేట్‌ కాపాడుకుండా స్టైక్‌ రొటేట్‌ చేసింది. 14 ఓవర్‌లో అయ్యర్‌ను హోల్డర్‌ ఔట్‌ చేయడంతో ఢిల్లీ 126 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. అనంతరం ధావన్‌కు హెట్‌మెయిర్‌ జతకలిసి ఇన్నింగ్స్‌లో మరొకసారి దూకుడు పెంచాడు. ఈ జోడి 30 బంతుల్లో 52 పరుగులు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement