దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను వికెట్‌ను నష్టపోయింది. రోహిత్ శర్మ తాను ఆడిన తొలి బంతికే గోల్డెన్ డక్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అశ్విన్ వేసిన క్విక్ డెలివరీ రోహిత్‌ను ప్యాడ్లను ముద్దాడటంతో ఎల్బీగా నిష్క్రమించాడు. కాగా, దీనికి రోహిత్ రివ్యూకు వెళ్లలేదు.
అది సరిగ్గా వికెట్లపైకే వెళుతుందని అంచనా వేసిన రోహిత్ రివ్యూను వృథా చేయకుండా పెవిలియన్ చేరాడు. అది స్టైట్‌ఫార్వర్డ్ డెలివరీ కావడంతో రోహిత్ రివ్యూకు వెళ్లినా అనవసరమనకున్నాడు. అయితే అది బెయిల్స్‌ను గిరాటు వేస్తున్నట్లు తర్వాత రిప్లేలో కనబడటంతో రోహిత్ మంచి నిర్ణయమే తీసుకున్నాడు. ఇక్కడ క్రెడిట్ రోహిత్‌కు ఇచ్చినా గోల్డెన్ డక్‌గా ఔట్ కావడంతో అభిమానులను నిరాశపరిచింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను డానియల్ సామ్స్ వేయగా, డీకాక్ ఫేస్ చేశాడు. ఆ ఓవర్‌లో డీకాక్ మూడు ఫోర్ల సాయంతో 15 పరుగులు సాధించాడు. కాగా, అశ్విన్ వేసిన రెండో ఓవర్ తొలి రెండు బంతుల్ని డీకాక్ ఆడగా, మూడో బంతిని రోహిత్ ఆడి డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ ముంబై స్కోరు తగ్గలేదు. పవర్ ప్లే ముగిసేసరికి ముంబై వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment