దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ బౌల్ట్ తొలి బంతికే వికెట్ తీసి అదిరే ఆరంభాన్నిచ్చాడు. ఈ మ్యాచ్ ముందువరకూ బౌల్ట్ ఆడటంపై అనేక అనుమానాలు తలెత్తాయి. గాయపడ్డ బౌల్ట్ అంతిమ సమరానికి ఫిట్ అవుతాడా.. లేదా అనే దానిపైనే చర్చ సాగింది. కానీ ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్న చివరి నిమిషంలో జట్టులోకి రావడంతో ముంబైకు బౌలింగ్ బెంగ లేకుండా పోయింది. అయితే టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ తీసుకోవడంతో స్టోయినిస్-శిఖర్ ధావన్‌లు ఇన్నింగ్స్ ఆరంభించారు.
తొలి ఓవర్‌ను అందుకున్న బౌల్ట్ తాను వేసిన తొలి బంతికే స్టోయినిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. బుల్లెట్‌లా దూసుకొచ్చిన ఆ బంతికి స్టోయినిస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. స్టోయినిస్ ఎలా ఆడాలని నిర్ణయించుకునేలోపే ఆ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ డీకాక్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో స్టోయినిస్ గోల్డెన్ డక్‌గా నిష్క్రమించగా, వాటే ఏ బాల్ అని అనుకోవడం మనవంతైంది.అదే బౌల్ట్ వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి అజింక్యా రహానే(2) పెవిలియన్ చేరాడు. దాంతో 16 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో ఆరు పరుగుల వ్యవధిలో శిఖర్ ధావన్(15) ఔటయ్యాడు. ధావన్‌ను జయంత్ యాదవ్ ఔట్ చేశాడు. దాంతో ఢిల్లీ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Comments
Please login to add a commentAdd a comment