'ముంబైతో మ్యాచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు మేలే' | Brian Lara Says Its Easy Chance For SRH Against Mumbai Indians | Sakshi
Sakshi News home page

ముంబైతో మ్యాచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు మేలే : లారా

Published Tue, Nov 3 2020 5:28 PM | Last Updated on Tue, Nov 3 2020 5:33 PM

Brian Lara Says Its Easy Chance For SRH Against Mumbai Indians - Sakshi

షార్జా : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో లీగ్‌ మ్యాచ్‌లు నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. షార్జా వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య ఆఖరి లీగ్‌ పోరు జరగనుంది. కాగా ముంబై ఇండియన్స్‌ ఇప్పటికే 18 పాయింట్లతో టాప్‌ లేపి ప్లేఆఫ్‌కు చేరగా.. ఎస్‌ఆర్‌హెచ్‌కు మాత్రం ఈ మ్యాచ్‌ చావోరేవో అనే పరిస్థితి. ముంబైతో మ్యాచ్‌లో గెలిస్తే ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్‌ చేరుతుంది.. ఓడిపోతే కేకేఆర్‌ వెళుతుంది. అయితే విండీస్‌ దిగ్గజం.. మాజీ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా మాత్రం ముంబైతో జరిగే మ్యాచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు మేలు చేయనుందని అంటున్నాడు. (చదవండి : ప్లీజ్ ఆ నిబంధనను తప్పనిసరి చేయండి : సచిన్‌)

' ముంబై.. ఈ మ్యాచ్‌లో సమూల మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లీగ్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో టాప్‌ స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అడుగుపెట్టిన ముంబై ఈ మ్యాచ్‌ను పెద్దగా పట్టించుకోదనే అనుకుంటున్నా.ఇప్పటివరకు అవకాశం రాని ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లకు ముంబై తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఈ అవకాశం ఎస్‌ఆర్‌హెచ్‌కు లాభం చేకూర్చనుంది. దీనిని వినియోగింకొని ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్‌ చేరుతుందనే అనుకుంటున్నా. 'అంటూ లారా చెప్పుకొచ్చాడు. (చదవండి :‘ధోని 400 పరుగులు చేయగలడు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement