ఇక సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌దే భారం.. | Mumbai Indians Set Target Of 150 Runs Against SRH | Sakshi
Sakshi News home page

ఇక సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌దే భారం..

Published Tue, Nov 3 2020 9:21 PM | Last Updated on Tue, Nov 3 2020 9:22 PM

Mumbai Indians Set Target Of 150 Runs Against SRH - Sakshi

షార్జా:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై  ఇండియన్స్‌ 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ముంబై ఆటగాళ్లలో పొలార్డ్‌(41; 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), డీకాక్‌(25; 13 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), సూర్యకుమార్‌( 36; 29 బంతుల్లో 5 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌(33: 30 బంతుల్లో 1 ఫోర్‌, 2సిక్స్‌లు)లు మాత్రమే ఆడగా మిగతా వారు విఫలమయ్యారు. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో ముంబై బ్యాటింక్‌కు దిగింది. ముంబై ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ, డీకాక్‌లు ఆరంభించారు.  కాగా, సందీప్‌ శర్మ వేసిన మూడో ఓవర్‌ మూడో బంతికి రోహిత్‌(4) ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌- డీకాక్‌లు ఇన్నింగ్స్‌ను నడిపించారు. 

డీకాక్‌ అయితే అత్యంత దూకుడుగా కనిపించాడు. సందీప్‌ శర్మ వేసిన ఐదో ఓవర్‌లో వరుస రెండు సిక్స్‌లు కొట్టిన డీకాక్‌.. అదే ఓవర్‌ ఐదో బంతికి బౌల్డ్‌ అయ్యాడు. బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ గిరాటేయడంతో డీకాక్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆపై సూర్యకుమార్‌ యాదవ్‌-ఇషాన్‌ కిషన్‌లు మరోసారి బ్యాట్‌ ఝుళిపించారు. అయితే నదీమ్‌ వేసిన 12 ఓవర్‌ తొలి బంతికి సూర్యకుమార్‌ స్టంపౌట్‌ కాగా,  ఆ ఓవర్‌ నాల్గో బంతికి కృనాల్‌ పాండ్యా డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత రషీద్‌ వేసిన 13 ఓవర్‌ తొలి బంతికి సౌరవ్‌ తివారీ(1) ఔటయ్యాడు. సాహా క్యాచ్‌ పట్టడంతో తివారీ పెవిలియన్‌ చేరాడు. ఫలితంగా పరుగు వ్యవధిలో ముంబై ఇండియన్స్‌ మూడు వికెట్లు కోల్పోయింది. 39 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయిన ముంబై.. 82 పరుగుల స్కోరు చేరే సరికి ఐదు వికెట్ల నష్టపోయింది.  

ఆ తరుణంలో ఇషాన్‌ కిషన్‌-పొలార్డ్‌లు స్కోరును చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి 33 పరుగులు జత చేసిన తర్వాత ఇషాన్‌ కిషన్‌ ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. సందీప్‌ శర్మ వేసిన 17 ఓవర్‌ మూడో బంతికి బౌల్డ్‌ అయ్యాడు. హోల్డర్‌ వేసిన 18 ఓవర్‌ రెండో బంతికి కౌల్టర్‌ నైల్‌(1) ఔటయ్యాడు.  చివర్లో పొలార్డ్‌ మెరుపులు మెరిపించాడు. నటరాజన్‌ వేసిన 19 ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టడమే కాకుండా , హోల్డర్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో సిక్స్‌ కొట్టిన తర్వాత బంతికి బౌల్డ్‌ అయ్యాడు. ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ మూడు వికెట్లు సాధించగా, నదీమ్‌,హోల్డర్‌ చెరో రెండు వికెట్లు తీశాడు.  రషీద్‌ ఖాన్‌కు వికెట్‌ దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement