విరాట్ కోహ్లి(ఫోటో సోర్స్: పీటీఐ)
న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లికి పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదని ఆ జట్టు బౌలింగ్ మాజీ కోచ్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. యూఏఈలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కోహ్లిపై తీవ్ర ఒత్తిడి ఉందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఒత్తిడికి లోనైన కోహ్లి వికెట్ సమర్పించుకున్నాడన్నాడు. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌లు పెద్దగా వికెట్లు సాధించకపోయినా వారు అంత సులువుగా పరుగులు ఇవ్వడం లేదన్నాడు. ఇక్కడ ఆర్సీబీ కెప్టెన్ కోహ్లికి ఏ విధమైన చాన్స్ ఇవ్వని ఢిల్లీని ప్రత్యేకంగా అభినందించాలన్నాడు. (అదే పాంటింగ్ నాతో చెప్పాడు: రహానే)
అసలు అరోన్ ఫించ్ జట్టులో లేనప్పుడు కోహ్లి ఓపెనర్‌గా దిగితేనే మంచిదన్నాడు. కనీసం రాబోవు మ్యాచ్‌ల్లోనైనా ఫించ్ లేని పక్షంలో కోహ్లి ఓపెనర్‌గా రావాలన్నాడు. ఆర్సీబీ జట్టులో ఫించ్ లేకపోతే కోహ్లినే ఓపెనర్‌గా కరెక్ట్ అని నెహ్రా పేర్కొన్నాడు.రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఆర్సీబీ 153 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అజింక్యా రహానే(60; 46 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్)లు రాణించి విజయానికి బాటలు వేశాడు. అయితే ఆర్సీబీ ఓడినప్పటికీ ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఢిల్లీ తన విజయాన్ని 19 ఓవర్ల వరకూ తీసుకురావడంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment