ముంబై విజయం.. ఆడిపాడిన రణ్‌వీర్‌ | Ranveer And Amitabh Celebrates Mumbai Indians Clinch Title | Sakshi
Sakshi News home page

ముంబై విజయం.. ఆడిపాడిన రణ్‌వీర్‌

Published Wed, Nov 11 2020 11:29 AM | Last Updated on Wed, Nov 11 2020 11:57 AM

Ranveer And Amitabh Celebrates Mumbai Indians Clinch Title - Sakshi

ముంబై: దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ 2020 టైటిల్‌ గెలవడంపట్ల బాలీవుడ్‌ నటులు రణ్‌వీర్‌ సింగ్‌, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ముంబై గెలుపు ఖాయమవగానే రణ్‌వీర్‌ సింగ్‌ ఆ జట్టు జెర్సీని ధరించి తన సినిమాలోని పాట పాడుతూ స్టెప్పులేశాడు. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇక బిగ్‌బీ అమితాబ్‌, అభిషేక్‌ బచ్చన్‌, మిర్జాపుర్‌ నటుడు అలీ ఫజల్‌ కూడా ట్విటర్‌లో తన ఆనందాన్ని తెలియజేశారు. కాగా, దుబాయ్‌ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌లో ఢిల్లీ కాపిటల్స్‌పై ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా రెండో సంవత్సరం ఐపీఎల్‌ టైటిల్‌ని సాధించింది. 2019 ఐపీఎల్‌ ఫైనల్లోనూ ముంబై జట్టు చెన్నైపై గెలిచిన సంగతి తెలిసిందే.   (ఈ విజయం తనకే అంకితం: హార్దిక్‌) 

ఇక తాజా మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీ జట్టు ట్రెంట్‌ బౌల్ట్‌ ధాటికి 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (50 బంతుల్లో 65)తో జట్టును ఆదుకున్నాడు. రిషబ్‌ పంత్‌ 56 పరుగులతో రాణించాడు. దాంతో ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్‌కు దిగిన ముంబై జట్టు ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (12 బంతుల్లో 20) ధాటిగా ఆడడంతో 3 ఓవర్లలో 33 పరుగులు చేసింది. మరోవైపు రోహిత్‌ (51 బంతుల్లో 68 పరుగులు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌, ఇషాన్‌ కిషన్‌ (19 బంతుల్లో 33 పరుగులు) మెరుపు బ్యాటింగ్‌తో ముంబై విజయతీరాలకు చేరింది. 4 ఓవర్లలో 30 పరుగులకు 3 వికెట్లు తీసి  మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గెలుచుకున్నాడు.   (ముంబై ఇండియన్స్‌ పాంచ్‌ పటాకా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement