దుబాయ్: ముంబై ఇండియన్స్ జట్టు ఫుల్ ఫామ్‌లో ఉన్న కారణంగానే ఆ జట్టును నియంత్రించడం సాధ్యం కాలేదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు. హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్‌లు కింది వరుసలో బ్యాటింగ్‌కు వస్తున్నారంటే ఆ జట్టు బలం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నాడు. హార్దిక్, పొలార్డ్‌లు దిగువన ఉన్నారన్న ధైర్యం కూడా ముంబై టాపార్డర్‌లో వచ్చే ఆటగాళ్లు రాణించడానికి ఒక కారణమన్నాడు. టాపార్డర్ వచ్చే ముంబై ఆటగాళ్లు ఫుల్ ఫ్రీడమ్ బ్యాటింగ్ చేస్తున్నారంటే వారి చివరి వరుస బ్యాటింగ్ లైనప్ కూడా మెరుగ్గా ఉండటమేనన్నాడు.(రోహిత్ ఉన్న ప్రతీసారి గెలిచారు.. కానీ ధోని లేడు!)
గురువారం జరిగిన క్యాలిఫయర్-1 మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఢిల్లీని ముంబై చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత అయ్యర్ మాట్లాడుతూ.. ప్రతీ రోజూ మనది కాదన్నాడు. తమ జట్టు ఓడినప్పటికీ తాను నెగటివ్‌గా మాట్లాడలేనని తెలిపాడు. 'ఈ ఓటమి కఠినంగానే ఉంది. అయినప్పటికీ మా జట్టు గురించి వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు. సానుకూల దృక్పథంతో తదుపరి మ్యాచ్‌లో విజయం సాధిస్తాం. ఆరంభంలో రెండు వికెట్లు తీసిన తర్వాత మ్యాచ్‌లో పై చేయి సాధించాం. 13, 14 ఓవర్లలో ముంబై 110 పరుగులే చేసింది. ఆ పరిస్థితిని అలానే కొనసాగించి 170 పరుగులకు పరిమితం చేస్తే మాకు గెలిచే అవకాశం ఉండేది. కానీ ఇవన్నీఆటలో సహజమే. ప్రతీ రోజు మనది కాదు’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment