
దుబాయ్: ముంబై ఇండియన్స్‌కు ఫైనల్‌కు చేరిన ఆనందం ఒకటైతే, ట్రెంట్ బౌల్ట్ గాయం ఆ జట్టును కలవర పెడుతోంది. ప్రస్తుతం తొడ కండరాల గాయంతో సతమతమవుతున్న బౌల్ట్ ఫైనల్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో బౌల్ట్ గాయంతో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత బౌలింగ్ చేసేందుకు మళ్లీ రాలేదు. మ్యాచ్ జరుగుతుండగా.. బౌల్ట్ డ్రెసింగ్ రూంలో కనిపించాడు. మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'మైదానం వీడిన తర్వాత బౌల్ట్‌ను మళ్లీ చూడలేదు. అతడికైనా గాయం తీవ్రమైంది కాదనిపిస్తోంది. గాయం చిన్నదే కాబట్టి ఎలాంటి ఆందోళన లేదు. ఫైనల్ మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉంది. ఈలోగా అతడు కోలుకుంటాడు' అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అయితే బౌల్ట్‌కు అయినా గాయంపై ఎలాంటి స్పష్టత లేదు.201 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ బరిలో దిగగా.. తొలి ఓవర్లోనే ఓపెనర్ పృథ్వీ షా (0), అజింక్య రహానే (0)లను ట్రెంట్ బౌల్ట్ ఔట్ చేశాడు. రెండో ఓవర్ బౌలింగ్‌కు దిగిన బుమ్రా.. అద్భుతమైన యార్కర్‌తో శిఖర్ ధావన్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు బోర్డుపై ఒక్క పరుగైనా చేరకుండానే మూడు వికెట్లు కోల్పోయింది. మంచి ఫామ్‌లో ఉన్న రహానేను బౌల్ట్ ఔట్ చేయడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది. ఇదే ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించడానికి దోహద పడింది.
Comments
Please login to add a commentAdd a comment