అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్‌లో భాగంగా క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ క్యాపిటల్స్‌లు తలపడనున్నాయి. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఊపు మీదున్న సన్‌రైజర్స్ మరో గెలుపుపై కన్నేసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరును ఓడించిన హైదరాబాద్... ఇప్పుడు ఢిల్లీనీ ఓడిస్తే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం సన్‌రైజర్స్ మంచి జోరు మీద ఉంది. ఒక దశలో 9 మ్యాచ్‌లకు మూడే విజయాలు సాధించిన ఆరెంజ్ ఆర్మీ.. వరుసగా నాలుగు విజయాలను ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌కు చేరింది. ముఖ్యంగా బౌలింగే రైజర్స్ బలంగా మారింది. ఇక తొలి 9 మ్యాచ్‌లలో 7 గెలిచి అభేద్యంగా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత కుప్పకూలింది.
వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది. ఎట్టకేలకు ఆఖరి లీగ్‌లో బెంగళూరుపై గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరినా... టీమ్ ఆట మారలేదని తొలి క్వాలిఫయర్‌లో చెత్త ప్రదర్శన చూపించింది. జట్టు టాపార్డర్ మరీ పేలవం. ఎవరిని ఆడించాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. వరుసగా రెండు సెంచరీలు ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సాధించిన ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్.. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ నాలుగు డకౌట్లు అయ్యాడు. ఇది ఢిల్లీని ఆందోళనకు గురిచేస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయడానికి మొగ్గుచూపాడు. అబుదాబిలో జరిగిన గత 9 మ్యాచ్‌లలో 8 సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఇప్పడు సన్‌రైజర్స్ ఛేజింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది సన్‌రైజర్స్ కు కలిసొస్తుందా లేదో చూడాలి. ఈ మ్యాచ్‌కు సైతం సాహా దూరమయ్యాడు.
హ్యాట్రిక్ కొట్టి ఫైనల్‌కు చేరతారా!
సన్‌రైజర్స్ కూల్‌గా తన పని తాను చేసుకుపోతోంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ జట్టు ఎటువంటి ఆందోళన లేకుండా వరుస విజయాలు సాధించడంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. మరొకవైపు ఈ సీజన్‌లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ వార్నర్ గ్యాంగ్‌దే పైచేయి అయ్యింది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి పోరులో 15 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలవగా, రెండో మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు.
ఈ సీజన్‌లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా హైదరాబాద్ గెలిచింది. తొలి మ్యాచ్‌లో 15 పరుగులతో నెగ్గిన రైజర్స్, రెండో పోరులో 88 పరుగులతో ఘన విజయం సాధించింది. దాంతో ఢిల్లీపై హ్యాట్రిక్ విజయం సాధించి ఫైనల్‌కు చేరాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. ఇరుజట్లు ఓవరాల్‌గా ముఖాముఖి పోరులో 17 సార్లు తలపడగా సన్‌రైజర్స్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఢిల్లీ 6సార్లు మాత్రమే గెలుపును అందుకుంది.
సన్‌రైజర్స్ జట్టులో డేవిడ్ వార్నర్(546), మనీష్ పాండే(4040), బెయిర్ స్టో(345)లు టాప్ స్కోరర్లుగా ఉండగా, బౌలింగ్‌లో రషీద్ ఖాన్(19), నటరాజన్(16), సందీప్ శర్మ(13)లు అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వరుసగా ఉన్నారు. ఇక ఢిల్లీ జట్టులో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శిఖర్ ధావన్(525), శ్రేయస్ అయ్యర్(433), మార్కస్ స్టోయినిస్(314)లు వరుసగా ఉన్నారు. టాప్ వికెట్ టేకర్ల జాబిజాతాలో రబడా(25), నోర్జే(20), రవిచంద్రన్ అశ్విన్(13)లు వరుసగా ఉన్నారు.
ఢిల్లీ
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శిఖర్ ధావన్, అజింక్యా రహానే, రిషభ్ పంత్, హెట్‌మెయిర్, స్టోయినిస్, అక్షర్ పటేల్, అశ్విన్, ప్రవీణ్ దూబే, రబడా, నోర్జే
ఎస్‌ఆర్‌హెచ్
డేవిడ్ వార్నర్(కెప్టెన్), శ్రీవత్స్ గోస్వామి, మనీష్ పాండే, విలియమ్సన్, ప్రియాం గార్గ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సామద్, రషీద్ ఖాన్, నదీమ్, సందీప్ శర్మ, నటరాజన్
Comments
Please login to add a commentAdd a comment