న్యూఢిల్లీ: క్రికెటర్లకు తన ట్రేడ్‌మార్క్ షాట్(ఎక్కవగా కొట్టే షాట్లు) అనేది ఒకటి కచ‍్చితంగా ఉంటుంది. కానీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్రేడ్‌మార్క్ షాట్లు చాలానే ఉన్నాయి. స్ట్రైట్‌డ్రైవ్, కట్ షాట్, కవర్ డ్రైవ్‌లతో పాటు ఇంకా చాలా ట్రేడ్‌మార్క్ షాట్లు సచిన్ సొంతం. దాంతోనే బౌలర్లపై సచిన్ ఆధిపత్యం కొనసాగేది. ఇక సచిన్ షాట్లలో అప్పర్ కట్ షాట్ ఒకటి. 2001 దక్షిణాఫ్రికా పర్యటనలో ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా ఆ షాట్లను అలవోకగా ఆడేశాడు సచిన్. తాజాగా ఆ అప్పర్ షాట్ గురించి యూట్యూబ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌లో సచిన్ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. అనురాజ్ ఆందే అనే అభిమాని సచిన్‌ను అప్పర్ కట్ షాట్ గురించి అడిగాడు. ‘మీరు అప్పర్ కట్ షాట్లను ఆడటం కోసం స్పెషల్‌గా ఏమైనా ప్రాక్టీస్ చేశారా’? అని ప్రశ్నించాడు. (ఒక గిఫ్ట్‌గా ముంబై చేతిలో పెట్టారు: టామ్ మూడీ)
దానికి సచిన్ బదులిస్తూ.. ‘అది 19 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగింది. మేము బ్లోమ్‌ఫాంటీన్‌లో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైనప్పుడు తొలుత బ్యాటింగ్‌కు దిగాం. అప్పుడు ఎన్తిని ఆఫ్ స్టంప్ బంతుల్ని ఎక్కువగా వేసేవాడు. అతను షార్ట్ లెంగ్త్ డెలివరీలను రెగ్యులర్‌గా వేస్తూ ఉంటాడు. లెంగ్త్ డెలివరీలు అనేవి చాలా తక్కువగా వేసేవాడు. క్రీజ్‌కు బాగా ఎడంగా పరుగెత్తుకొచ్చి బౌలింగ్ వేయడం అతనికి అలవాటు. అదే సమయంలో దక్షిణాఫ్రికా పిచ్‌ల్లో బౌన్స్ కూడా ఎక్కువగా వస్తుంది. నా ఎత్తు కంటే బంతి ఎక్కువ ఎత్తులో వచ్చినప్పడు దూకుడుగా బ్యాటింగ్ చేసే క్రమంలో అప్పర్ కట్ షాట్ ఆడేవాడిని. బంతిని వేటాడి గ్రౌండ్ అవతలికి పంపేవాడిని. అది థర్డ్ మ్యాన్ స్థానం నుంచి అప్పర్ కట్ షాట్లు ఆడేవాడిని. అది చాలా మంది బౌలర్లను డిస్టర్బ్ చేసిందనే అనుకుంటున్నా. ఏ బౌలర్ అయినా బౌన్స్ వేస్తే అది డాట్ బాల్ కావాలనుకుంటారు(పరుగులు రాకుండా ఉండటం). కానీ నేను అప్పర్ కట్ షాట్‌తో బౌండరీ లైన్ దాటించడంతో బౌలర్లకు నిరాశ ఎదురవుతుంది. దీని కోసం ప్రత్యేకంగా ప్రణాళిక ఏమీ ఉండేది కాదు’ అని సచిన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment