టీమిండియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ కీ ప్లేయర్ విరాట్ కోహ్లి, బీసీసీఐ మాజీ బాస్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంతో మొదలైన వీరిద్దరి మధ్య అగాధం ప్రస్తుతం పతాక స్థాయికి చేరి, ఒకరినొకరు అవమానించుకునే స్థితికి చేరింది. తాజాగా జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ (ఐపీఎల్-2023లో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ) సందర్భంగా వీరిద్దరూ ఎదురెదురు పడినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోకుండా తప్పించుకున్నారు. తొలుత కోహ్లి ఏదో మనసులో పెట్టుకుని గంగూలీ వైపు కోపంగా చూడగా.. ఆతర్వాత ఇరువురు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే తరుణంలో (మ్యాచ్ అనంతరం) కోహ్లిని చూసి గంగూలీ తప్పుకున్నాడు.
The way Virat Kohli looked at ganguly pic.twitter.com/pLoAzyn9EI
— itz_mksoni25 (@_itz_mksoni25) April 17, 2023
Virat Kohli stares towards Sourav Ganguly and Ricky Ponting after takes the catch. 🔥 pic.twitter.com/EmuAzzzzMb
— S. (@Sobuujj) April 15, 2023
దీంతో కోహ్లికి చిర్రెత్తిపోయి వెనక్కు తిరిగి గంగూలీవైపు మరోసారి బిర్రుగా చూశాడు. ఈ మొత్తం తంతుకి సంబంధించిన వీడియోలు కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కోహ్లి.. గంగూలీ తన పట్ల ప్రవర్తించిన తీరుకు కౌంటర్‌గా ఓ భారీ ఝలక్ ఇచ్చాడు. కోహ్లి.. ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని అన్‌ఫాలో చేసి, తమ మధ్య అగాధాన్ని మరింత పెంచుకున్నాడు. మరోవైపు గంగూలీ మాత్రం సోషల్‌మీడియాలో కోహ్లిని ఇప్పటికీ ఫాలో అవుతూ ఉండటం విశేషం. కోహ్లి చర్యకు ప్రతిచర్యగా గంగూలీ ఏం చేస్తాడోనని క్రికెట్ ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Saurav Ganguly ignored Virat Kohli and Walk off where you can see Kohli turned back to see Dada
— R e t i r e d (@Sense_detected_) April 15, 2023
Once again Dada showed Virat Kohli his place 👏 pic.twitter.com/AphU0U3IMO
ఇదిలా ఉంటే, ఏప్రిల్ 15న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎడిషన్‌లో ఢిల్లీకి ఇది వరుసగా ఐదో పరాజయం కాగా.. ఆర్సీబీ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 అపజయాలను ఎదుర్కొంది. లీగ్‌లో భాగంగా ఆర్సీబీ ఇవాళ (ఏప్రిల్ 17) చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుండగా.. ఏప్రిల్ 20న ఢిల్లీ, కేకేఆర్‌ను ఢీకొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment