Photo credit: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఇవాళ (మే 6) రాత్రి 7: 30 గంటలకు జరుగనున్న మ్యాచ్‌లో ఓ భారీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 12 పరుగులు చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 6988 పరుగులు (232 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత శిఖర్ ధవన్ (6536), డేవిడ్ వార్నర్ (6189), రోహిత్ శర్మ (6063) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు.
చదవండి: CSK VS MI: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ శర్మ
కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో (9 మ్యాచ్‌ల్లో 364 పరుగులు, 5 ఫిఫ్టీలు) ఉన్న విరాట్ కోహ్లికి ఢిల్లీతో మ్యాచ్‌లోనే 7000 పరుగుల మార్కును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఐపీఎల్-2023 50వ మ్యాచ్‌లో కోహ్లి ఈ మైలురాయిని అందుకోగలిగితే, అతనికి ఈ మ్యాచ్‌లో చిరకాలం గుర్తుండిపోతుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే విషయంలోనూ ఈ మ్యాచ్ చాలా కీలకంగా ఉన్నందున, కోహ్లి సైతం ఈ మ్యాచ్‌లో శక్తి మేరకు రాణించాలని ఆశిస్తాడు.
ఆర్సీబీ ప్రస్తుతం 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో (-0.030) కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ తేడాతో గెలిస్తే ఏకంగా 3 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో ప్లేస్‌కు (ముంబై చేతిలో చెన్నై ఓడితే) ఎగబాకుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్‌లో (14 పాయింట్లు) ఉండగా.. లక్నో (11 పాయింట్లు, 0.639) రెండులో, సీఎస్‌కే (11 పాయింట్లు, 0.329) మూడులో, రాజస్థాన్ (10 పాయింట్లు, 0.448) నాలుగో స్థానంలో ఉన్నాయి.
చదవండి: DC Vs RCB: విరాట్ సెంచరీ కొట్టు.. ఆర్సీబీని గెలిపించు! అదే దాదాకు నువ్విచ్చే కానుక
Comments
Please login to add a commentAdd a comment