IPL 2023 RCB Vs DC: Fans Fires On Dinesh Karthik For Duck Out Again - Sakshi
Sakshi News home page

Dinesh Karthik: దినేశ్‌ కార్తిక్‌ డకౌట్‌.. ఇంకోసారి ఇలా చేస్తే జైళ్లో వేయాలి! ధోని ఫ్యాన్స్‌ ఫైర్‌

Published Sat, Apr 15 2023 7:27 PM | Last Updated on Sat, Apr 15 2023 8:43 PM

IPL 2023 RCB Vs DC: Fans Fires On Dinesh Karthik For Duck Out Again - Sakshi

దినేశ్‌ కార్తిక్‌ (Photo Credit : IPL Twitter)

IPL 2023- Royal Challengers Bangalore vs Delhi Capitals: టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ గతేడాది ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. కీలక సమయంలో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ ఆడి విలువైన ఆటగాడిగా నిరూపించుకున్నాడు. అనేక సందర్భాల్లో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చి బెస్ట్‌ ఫినిషర్‌ అనిపించుకున్నాడు.

అప్పుడలా
ఐపీఎల్‌-2022 సీజన్‌లో మొత్తంగా 16 మ్యాచ్‌లలో కలిపి 330 పరుగులు సాధించిన డీకే.. జాతీయ జట్టులో పునరాగమనం చేశాడు. ప్రపంచకప్‌ వంటి ఐసీసీ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో చాలా మంది ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను మాజీ సారథి, టీమిండియా అత్యుత్తమ ఫినిషర్‌తో మహేంద్ర సింగ్‌ ధోనితో పోలుస్తూ కామెంట్లు చేశారు.

ఇప్పుడిలా
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2023లోనూ గత ఎడిషన్‌ మాదిరే మెరుపులు మెరిపిస్తాడని భావించిన అభిమానులకు మాత్రం పూర్తి నిరాశను మిగిల్చాడు దినేశ్‌ కార్తిక్‌. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున 4 మ్యాచ్‌లు ఆడిన డీకే చేసిన మొత్తం పరుగులు 10(0, 9, 1, 0).

ఢిల్లీ క్యాపిటల్స్‌తో సొంతమైదానంలో మ్యాచ్‌లో డీకే మరోసారి డకౌట్‌ కావడంతో అతడిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో శనివారం నాటి మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో లలిత్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

ధోని ఫ్యాన్స్‌ ఫైర్‌.. ఎందుకంటే
ఈ నేపథ్యంలో డీకే వరుస వైఫల్యాలను ఎండగడుతూ నెట్టింట భారీ ఎత్తున అతడిపై ట్రోలింగ్‌ జరుగుతోంది. ‘‘అంచనాలు అందుకోలేకపోతున్నావు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక సార్లు డకౌట్‌ అయింది నువ్వే. వెళ్లి కామెంట్రీ చెప్పుకో పో! అయినా చాలా మంది డీకేను ధోనితో పోల్చారు కదా!దయచేసి ఇప్పటికైనా అలా చేయడం మానేయండి. లేదంటే అలాంటి వాళ్లను జైళ్లో పడేయాలి.

ధోని వరస్ట్‌ సిట్యుయేషన్‌ కూడా డీకే బెస్ట్‌ కంటే మెరుగ్గానే ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి’’ అని ఘాటుగా ట్రోల్‌ చేస్తున్నారు. కాగా ఈ డకౌట్‌తో డీకే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు(15) అవుటైన బ్యాటర్‌గా మన్‌దీప్‌ సింగ్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది.

చదవండి: చెత్తగా ఆడుతున్నావు.. మారవా ఇక? వెంటనే అతడిని తప్పించి! వీడియో వైరల్‌
టీమిండియాకు శుభవార్త.. వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు బిగ్‌బూస్ట్‌! బీసీసీఐ కీలక ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement