జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయ భేరి మోగించింది. 115 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలు ఉండగా ఒక చోట అభ్యర్థి మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా వేశారు. దీంతో 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.
కాంగ్రెస్ గెలుపు 69 స్థానాలకే పరిమితమైంది. దీంతో అధికారాన్ని ఆ పార్టీ కోల్పోయింది. ఇక భారత్ ఆదివాసీ పార్టీ 3 సీట్లు గెలుచుకుని ప్రభావం చూపింది. బీఎస్పీ సైతం 2 స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ), రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌టీపీ)లకు ఒక్కొక్క సీటు దక్కాయి. మరోవైపు 8 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.
రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 100 స్థానాలు అవసరం కాగా బీజేపీ 115 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment