బాకు (అజర్‌బైజాన్): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు విజయాలు సాధించాయి. శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్‌లో పురుషుల జట్టు 2.5-1.5తో ఇంగ్లం డ్‌పై, మహిళల జట్టు 2.5-1.5తో ఉజ్బెకిస్తాన్‌పై గెలిచాయి. పెంటేల హరికృష్ణ, ఆధిబన్, విదిత్ తమ గేమ్ లను ‘డ్రా’ చేసుకోగా... నెజైల్ షార్ట్‌పై సేతురామన్ 41 ఎత్తుల్లో గెలిచి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. మహిళల విభాగంలో హారిక 37 ఎత్తు ల్లో నఫీసాపై గెలుపొందగా... పద్మిని, సౌమ్య, బొడ్డ ప్రత్యూష తమ ప్రత్యర్థులతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేశారు.