వెల్లింగ్టన్: విండీస్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం దాదాపుగా ఖాయమైనట్లే. వెలుతురులేమితో మూడోరోజు ఆదివారం ఆట నిలిచి పోయే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 6 వికెట్లకు 244 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే విండీస్ ఇంకా 85 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 124/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ మరో 7 పరుగులే జోడించి 131 పరుగులవద్ద ఆలౌటైంది.
న్యూజి లాండ్ బౌలర్లు జేమీసన్ (5/34), సౌతీ (5/32) విండీస్ వికెట్ల పతనాన్ని శాసించారు. 329 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించకుండా విండీస్‌ను ఫాలోఆన్ ఇన్నింగ్స్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ విండీస్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. కివీస్ బౌలర్లు బౌల్ట్ (3/75), జేమీసన్ (2/43) విజృంభించగా... జాన్ క్యాంప్‌బెల్ (109 బంతుల్లో 68; 8 ఫోర్లు), కెప్టెన్ జేసన్ హోల్డర్ (89 బంతుల్లో 60 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో విండీస్‌ను ఆదుకున్నారు. చివర్లో సిల్వా (25 బ్యాటింగ్)తో కలిసి హోల్డర్ ఏడో వికెట్‌కు అజేయంగా 74 పరుగుల్ని జోడించాడు. అనంతరం దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఆటను నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment