
వెల్లింగ్టన్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి 2–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం నాలుగోరోజు 85 పరుగుల లోటుతో 244/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 317 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ జోషువా సిల్వా (57; 6 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా... టెయిలెండర్లలో అల్జారి జోసెఫ్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో చకచకా 24 పరుగులు చేశాడు. వాగ్నర్, బౌల్ట్ చెరో 3 వికెట్లు, సౌతీ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 460 పరుగులు చేస్తే విండీస్ 131 పరుగులకే కుప్పకూలడంతో ఫాలోఆన్ ఆడా ల్సివచ్చింది. నికోల్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... జేమీసన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
అయినా... ఆసీసే ‘టాప్’
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియానే అగ్రస్థానంలో ఉందని ఐసీసీ ప్రకటించింది. కివీస్ 2–0తో కరీబియన్లను వైట్‌వాష్ చేసినప్పటికీ, 116 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియాతో సమంగా ఉన్నప్పటికీ డెసిమల్ పాయింట్ల వ్యత్యాసంతో న్యూజిలాండ్ రెండో స్థానంలోనే ఉందని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆసీస్ 116.461 పాయింట్లతో ఉండగా... కివీస్ 116.375 పాయింట్లతో ఉందని వివరణ ఇచ్చింది. టీమిండియా 114 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment