
వ్లోడిమిర్ జెలెన్‌స్కీ
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో హాస్య నటుడు వ్లోడిమిర్ జెలెన్‌స్కీ(41) ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జెలెన్‌స్కీకి 73.22 శాతం ఓట్లు రాగా, ప్రస్తుత అధ్యక్షుడు పెట్రో పొరోషెంకోకు 24.46 శాతం ఓట్లు దక్కాయి. సంప్రదాయ ఎన్నికల ప్రచారానికి భిన్నంగా కామెడీ స్కిట్లతో జెలెన్‌స్కీ ప్రజల్లోకి దూసుకెళ్లారు. వాస్తవానికి 2019, మార్చి 31న ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అయితే స్పష్టమైన ఫలితాలు రాకపోవడంతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జెలెన్ స్కీ, పొరోషెంకో మధ్య రెండో రౌండ్ ఎన్నికలు ఈ నెల 21న నిర్వహించారు. కాగా, జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘సర్వంట్ ఆఫ్ ది పీపుల్’ కామెడీ టీవీ సీరియల్‌లో జెలెన్‌స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నటించారు. ఈ సీరియల్ ముగిసిన నెలరోజుల్లో జెలెన్‌స్కీ నిజంగానే ఉక్రెయిన్ అధ్యక్షుడిగా గెలవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment