Russia-Ukraine: తమకంటే ఎన్నోరెట్ల బలమైన రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒకప్పుడు టీవీ సీరియళ్లలో హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. నటుడిగా, స్క్రిప్ట్ రైటర్‌గా, నిర్మాతగా వినోద రంగంలో రాణించారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. నటులు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం కొత్తేమీ కాకపోయినా ఆయన ప్రస్థానం నిజంగా ఆసక్తికరం. వొలొదిమిర్ జెలెన్‌స్కీ 1978 జనవరి 25న అప్పటి సోవియన్ యూనియన్‌లోని క్రైవీ రిహ్ పట్టణంలో యూదు కుటుంబంలో జన్మించారు.
చదవండి: (ఉక్రెయిన్ అణ్వాయుధాలు ఏమయ్యాయి?)
ప్రస్తుతం ఈ పట్టణం దక్షిణ ఉక్రెయిన్‌లో ఉంది. ఆయన మాతృభాష రష్యన్ అయినప్పటికీ ఉక్రెయినియన్, ఇంగ్లిస్ భాషల్లోనూ మంచి పట్టు సాధించారు. ప్రాథమిక, కళాశాల విద్య అనంతరం 2000 సంవత్సరంలో కీవ్ నేషనల్ ఎకనామిక్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించేందుకు అర్హత ఉన్నప్పటికీ అటువైపు మొగ్గు చూపలేదు. మొత్తం 130 సీట్లకు గాను ‘సర్వెంట్ ఆఫ్ ద పీపుల్’ పార్టీ ఏకంగా 124 సీట్లు గెలుచుకుంది.
జెలెన్‌స్కీ 2019 ఏప్రిల్ 21న ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2019 మే 20న ఉక్రెయిన్ ఆరో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పదవిలో కొనసాగుతున్నారు. జెలెన్‌స్కీ నేతృత్వంలోని ‘క్వర్తాల్ 95’ స్టాండప్ కామెడీ టీమ్ ఉక్రెయిన్ సైన్యానికి తన వంతు సాయం అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment