అల్‌హార్తికి మాన్‌ బుకర్‌ బహుమతి | Omani author Jokha Alharthi wins Man Booker International Prize | Sakshi
Sakshi News home page

అల్‌హార్తికి మాన్‌ బుకర్‌ బహుమతి

Published Thu, May 23 2019 4:55 AM | Last Updated on Thu, May 23 2019 4:55 AM

Omani author Jokha Alharthi wins Man Booker International Prize - Sakshi

లండన్‌: సాహిత్యరంగంలో అందించే ప్రఖ్యాత మాన్‌బుకర్‌ ప్రైజ్‌ 2019కిగానూ ఓ అరబ్‌ మహిళను వరించింది. ఒమన్‌కు చెందిన రచయిత్రి జోఖా అల్‌హార్తి(40) రాసిన ‘సెలస్టియల్‌ బాడీ’ నవలకు ఈసారి మాన్‌ బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. లండన్‌లోని రౌండ్‌హౌస్‌లో బుకర్‌ప్రైజ్‌ను అందుకున్న అల్‌హార్తి.. ఈ అవార్డును గెలుచుకున్న తొలి అరబ్‌ మహిళగా చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌ నుంచి 1951లో స్వాతంత్య్రం పొందాక ఒమన్‌లో చోటుచేసుకున్న మార్పులను, బానిసత్వం పరిస్థితులను ఈ నవలలో అల్‌హార్తి వర్ణించారు. ఈ అవార్డు కింద అందే రూ.44.60 లక్షల(64,000 డాలర్ల)ను అల్‌హార్తి, అనువాదకురాలు మార్లిన్‌ చెరిసగం పంచుకోనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement