లక్షన్నర ఓట్ల మెజారిటీతో అమ్మ విజయం | Jayalalithaa wins RK Nagar by-election | Sakshi
Sakshi News home page

లక్షన్నర ఓట్ల మెజారిటీతో అమ్మ విజయం

Published Tue, Jun 30 2015 1:46 PM | Last Updated on Thu, Aug 30 2018 6:07 PM

లక్షన్నర ఓట్ల మెజారిటీతో అమ్మ విజయం - Sakshi

లక్షన్నర ఓట్ల మెజారిటీతో అమ్మ విజయం

చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఏఐడీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం జె. జయలలిత విజయ దుందుభి మోగించారు. సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి అయిన మహేంద్రన్ పై లక్షా యాభైవేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు. సోమవారం ఉదయం చెన్నైలోని క్వీన్స్ మేరీ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ లోనూ అమ్మ ఆధిక్యతను ప్రదర్శించారు.

కేవలం 9. 690 ఓట్లు మాత్రమే సాధించిన మహేంద్రన్ డిపాజిట్ కోల్పోయారు. ఈ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అమ్మ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా ఆమె అనుచరులు సంబరాలు జరుపుకొన్నారు. పార్టీ కార్యాలయాల వద్ద బాణాసంచ పేల్చుతూ స్వీట్లు పంచుకున్నారు. తనకు ఓటు వేసి గెలిపించిన ఆర్కే నగర్ ప్రజలకు జయలలిత కృతజ్ఙతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement