
సాక్షి, చెన్నై : తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నిక అంటే మిగితా ప్రాంతాలకంటే ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే అది దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎప్పుడూ బరిలోకి దిగే స్థానం. అంతే కాకుండా అదే స్థానంలో డీఎంకే అధినేత కరుణానిధి కూడా తమ అభ్యర్థి తరుపున పోటాపోటీగా ప్రచారం నిర్వహించే చోటు. అయితే, జయలలిత చనిపోవడంతో ఖాళీగా ఉన్న ఆ స్థానానికి ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకోసం ప్రచారం జరుగుతుంది. భారీ లౌడ్ స్పీకర్లలో ఎంజీఆర్ పాటలు, ప్రచార నినాదాలతో ఆర్కే నగర్ వీధులన్ని మారుమోగుతున్నాయి.
అయితే, ఎక్కడ కూడా ప్రస్తుతం జయలలిత ఫొటోగానీ, కరుణానిధి ఫొటోగానీ కనిపించడం లేదు. ఓ పక్క పెద్ద పెద్ద హోర్డింగ్‌లకు మద్రాస్ కోర్టు అనుమతించకపోవడంతో అసలు ఎక్కడ కూడా ఫ్లెక్సీలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు బరిలోకి దిగిన అభ్యర్థిని కొనియాడుతున్నారే తప్ప ఆ క్రమంలో ఎవరూ జయనుగానీ, కరుణానిధిని గానీ తలుచుకోవడం లేదు. ఇప్పటికే కరుణానిధి అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో 'ఈసారి ఆర్కే నగర్ ఎన్నికలు, మా అమ్మ(జయలలిత) మా అయ్య(కరుణానిధి) లేకుండానే జరుగుతున్నాయి' అంటూ పలువురు సగటు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment