![prakash raj to play m karunanidhi in thalaivi movie - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/11/prakash-raj.jpg.webp?itok=sYu9FP2J)
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇరువర్’ (తెలుగులో ఇద్దరు) సినిమాలో కరుణానిధి పాత్రలో కనిపించారు నటుడు ప్రకాశ్ రాజ్. 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన కరుణానిధి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్ టైటిల్‌రోల్ చేస్తున్న చిత్రం ‘తలైవి’. ఈ సినిమాలో కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటించనున్నారట. యంజీఆర్ పాత్రలో అరవింద స్వామి కనిపించనున్నారు. జయలలిత రాజకీయ ప్రస్థానంలో కరుణానిధి పాత్ర కీలకమైనది. దీపావళి తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాను శైలేష్ ఆర్. సింగ్, విష్ణు ఇందూరి నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment