వికెట్ తీసిన అవేశ్‌తో రాహుల్ సంబరాలు (PC: IPL)
ముంబై: సన్‌రైజర్స్ ఆట మారలేదు. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఖాతా తెరవలేదు. కీలక తరుణంలో విలువైన వికెట్లు తీసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవేశ్ ఖాన్ (4/24), హోల్డర్ (3/34) లక్నో సూపర్‌జెయింట్స్‌ను గెలిపించారు. 12 పరుగులతో లక్నో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్ (50 బంతుల్లో 68; 6 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ హుడా (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులే చేయగల్గింది. రాహుల్ త్రిపాఠి (30 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
ఆకట్టుకున్న సుందర్
వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బంతులతో ఓపెనర్ డికాక్ (1), ఎవిన్ లూయిస్ (1)లను పెవిలియన్ చేర్చగా, మనీశ్ పాండే (11) తన వైఫల్యం కొనసాగించాడు. లక్నో పవర్‌ప్లేలో 32 పరుగులే చేసింది. జోరు తగ్గిన జట్టు ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రాహుల్, దీపక్ హుడా నిలబెట్టారు.
ఈ క్రమంలో మొదట హుడా 31 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్సర్లు), తర్వాత రాహుల్ 40 బంతుల్లో (5 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. నటరాజన్ ఒకే ఓవర్లో రాహుల్, కృనాల్ పాండ్యా (6)లను అవుట్ చేయడంతో ఆఖర్లో రావల్సినన్ని పరుగులు రాలేదు.
పడుతూ... లేస్తూ...
ఓపెనర్లు కేన్ విలియమ్సన్ (16), అభిషేక్ శర్మ (13)లను అవేశ్ ఖాన్ తక్కువ స్కోరుకే వెనక్కి పంపేశాడు. పవర్‌ప్లేలో హైదరాబాద్ స్కోరు 40/2. రాహుల్ త్రిపాఠి కాస్త వేగంగా ఆడటంతో రన్‌రేట్ క్రమంగా మెరుగవుతూ వచ్చింది. పూరన్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆశలు రేపినా, అవేశ్ వరుస బంతుల్లో పూరన్‌తో పాటు సమద్ (0)ను అవుట్ చేయడంతో ఆశలన్నీ ఆవిరయ్యాయి.
చివరి 6 బంతులకు 16 పరుగులు చేయాల్సిన దశలో ఆఖరి ఓవర్ వేసిన హోల్డర్ కేవలం 3 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక వరుసగా సన్‌రైజర్స్ రెండో పరాజయం చవిచూడటంతో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. మన రాత మారదా ఇక అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్కోరు వివరాలు
లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (ఎల్బీ) (బి) నటరాజన్ 68; డికాక్ (సి) విలియమ్సన్ (బి) సుందర్ 1; లూయిస్ (ఎల్బీ) (బి) సుందర్ 1; పాండే (సి) భువనేశ్వర్ (బి) షెఫర్డ్ 11; హుడా (సి) త్రిపాఠి (బి) షెఫర్డ్ 51; బదోని రనౌట్ 19; కృనాల్ (బి) నటరాజన్ 6; హోల్డర్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 169.
వికెట్ల పతనం: 1–8, 2–16, 3–27, 4–114, 5–144, 6–150, 7–169.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–25–0, సుందర్ 4–0–28–2, షెఫర్డ్ 4–0–42–2, ఉమ్రాన్ 3–0–39–0, సమద్ 1–0–8–0, నటరాజన్ 4–0–26–2.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) పాండే (బి) అవేశ్ 13; విలియమ్సన్ (సి) టై (బి) అవేశ్ 16; త్రిపాఠి (సి) బిష్ణోయ్ (బి) కృనాల్ 44; మార్క్‌రమ్ (సి) రాహుల్ (బి) కృనాల్ 12; పూరన్ (సి) హుడా (బి) అవేశ్ 34; సుందర్ (సి) రాహుల్ (బి) హోల్డర్ 18; సమద్ (సి) డికాక్ (బి) అవేశ్ 0; షెఫర్డ్ (సి)బదోని (బి) హోల్డర్ 8; భువనేశ్వర్ (సి) డికాక్ (బి) హోల్డర్ 1; ఉమ్రాన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 157.
వికెట్ల పతనం: 1–25, 2–38, 3–82, 4–95, 5–143, 6–143, 7–154, 8–156, 9–157.
బౌలింగ్: హోల్డర్ 4–0–34–3, కృనాల్ పాండ్యా 4–0–27–2, అవేశ్‌ఖాన్ 4–0–24–4, ఆండ్రూ టై 4–0–39–0, రవి బిష్ణోయ్ 4–0–29–0.
ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్ X బెంగళూరు
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.
Brilliant bowling performance by #LSG as they defend their total of 169/7 and win by 12 runs 👏👏
— IndianPremierLeague (@IPL) April 4, 2022
Scorecard - https://t.co/89IMzVls6f #SRHvLSG #TATAIPL pic.twitter.com/MY2ZhM3Mqe
Comments
Please login to add a commentAdd a comment