
బ్రాండ్ల విషయంలో ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆ మధ్య ఆయన ధరించే మాస్క్, బ్లేజర్, షూల గురించి సోషల్ మీడియాలో చర్చ జరగ్గా..ఇప్పుడు ఆయన చేతికి ఉన్న వాచ్ చర్చనీయాంశంగా మారింది. మరి ఆ వాచ్ ప్రత్యేక ఏంటనేది డౌట్ రావొచ్చ. అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా జరిగిన ‘ఆర్‌ఆర్‌ర్’ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్ చేతికి ధరించిన వాచ్‌పై అందరి దృష్టి పడింది. అది చాలా స్పెషల్‌గా ఉండడంతో.. దీని ధర ఎంత ఉంటుందబ్బా.. అని సెర్చ్ చేస్తే.. దిమ్మతిరిగిపోయింది. ఆ వాచ్ ధర దాదాపు నాలుగు కోట్ల రూపాయలు(5,14,800 డాలర్లు) .
రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ వాచ్ అది(Richard Mille rm 011 CarbonNtpt Grosjean Rose Gold lotus F1 Team limited Edition). ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్‌లతో ఇది ఒకటి. ఈ బ్రాండ్‌లో లభించే ప్రతి వాచ్ చాలా ఖరీదైనదే. ఎన్టీఆర్ ఇష్టంతో ఈ వాచ్ కొలుగోలు చేశాడట. ఇలాంటివి ఆయన దగ్గర మరో రెండు వాచ్ లు ఉన్నాయని సమాచారం. వాస్తవానికి ఎన్టీఆర్ కి కార్లు, వాచ్‌లు, దుస్తులు అంటే చాలా ఇష్టం. వాటికోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారు. ఎన్టీఆర్ కి నచ్చితే చాలు.. రేటు చూడకుండా కొనేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment