
Diehard Fan Gets Costly Gift From Darling Prabha: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే కొందరి అభిమానం హీరోలనే ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. తాజాగా ప్రభాస్ వీరాభిమాని ఒకరు ప్రభాస్‌కి షాక్చిచే రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. తలపై ప్రభాస్ అని అక్షరాలు కనిపించేలా గుండు కొట్టించుకున్నాడు. అతని అభిమానాన్ని చూసి షాక్ అయిన ప్రభాస్ సరదాగా అతడితో కాసేపు ముచ్చటించాడు. చదవండి: రామ్‌చరణ్ హెయిర్ స్టైలిస్ట్‌కు ఒక్క రోజుకే అన్ని లక్షలా?
అనంతరం తన వీరాభిమానికి ఖరీధైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇది ఫాజిల్ కంపెనీకి చెందిన వాచ్ అని తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ప్రభాస్ తన అభిమానులకు ఇలా గిఫ్ట్‌లు ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ డార్లింగ్ పలువురికి బహుమతులు ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. వచ్చే ఏడాది సంక్రాంతికి రాధేశ్యామ్‌తో సందడి చేయనున్నాడు ప్రభాస్.
చదవండి: Suriya: హీరో సూర్య ఇంటి వద్ద హై సెక్యూరిటీ
బంగారం మూవీలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా?