డబ్బు మనిషిని రాజ్యాలనుఏలే రాజులుగా మారుస్తుంది. రోడ్లపై ఉండే బిచ్చగాళ్లుగా మారుస్తుంది. దాన్ని ఎలా వాడుతున్నామనేదే ప్రధానం. అయితే సంపాదించిన సొమ్మంతా ఎలా దాచుకుంటున్నామనేది కూడా ముఖ్యమని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
డబ్బు దాయాలంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది బ్యాంకులు. సేవింగ్స్ స్కీమ్‌లు, రికరింగ్ డిపాజిట్లు, ఎఫ్‌డీ.. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌మార్కెట్ షేర్లు, రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు, భవనాలు కొనుగోలు చేయడం.. ఇలా వివిధ మార్గాల్లో డబ్బు దాస్తున్నారు. వీటితోపాటు బాగా డబ్బు సంపాదిస్తున్నవారు ఖరీదైన గడియారాలను కొనుగోలు చేస్తూ వాటిరూపంలో సంపద దాస్తున్నారు.
ఇటీవల హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చని ఏసీబీ భావిస్తోంది. అయితే తన పేరుతో 214 ఎకరాలు భూమి, తెలంగాణతోపాటు విశాఖపట్నంలో 29 ప్లాట్లు, 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాంతోపాటు ఖరీదైన గడియారాలు కూడా ఉన్నట్లు చెప్పారు.
ప్రపంచంలోనే ఖరీదైన గడియారాలు..(ఫోర్బ్స్ డేటా ప్రకారం)
1. గ్రాఫ్ డైమండ్స్ హాలూసినేషన్
- ధర: రూ.458 కోట్లు
- ఉపయోగించిన పదార్థం: ప్లాటినం
- తయారీ సంవత్సరం: 2014
- ప్లాటినమ్ బ్రాస్‌లెట్‌తో ఉన్న ఈ గడియారాన్ని 110 క్యారెట్ల విభిన్న రంగులతో కూడిన వజ్రాలతో తయారుచేశారు.
2. గ్రాఫ్ డైమండ్స్ ది ఫాసినేషన్
- ధర: రూ.333 కోట్లు
- ఉపయోగించిన పదార్థం: డైమండ్
- తయారీ సంవత్సరం: 2015
- 152.96 క్యారెట్ల తెల్లని వజ్రాలను కలిగి అరుదైన 38.13 క్యారెట్ల వజ్రం సెంట్రల్ డయల్‌గా పనిచేస్తుంది.
3. పటేక్ ఫిలిప్ గ్రాండ్‌మాస్టర్ చైమ్ రెఫ్. 6300A-010
- ధర: రూ.258 కోట్లు
- ఉపయోగించిన పదార్థం: తెలుపు బంగారం
- తయారీ సంవత్సరం: 2019
4. బ్రెగ్యుట్ గ్రాండే కాంప్లికేషన్ మేరీ ఆంటోయినెట్
- ధర:రూ. 250 కోట్లు
- ఉపయోగించిన పదార్థం: బంగారం
- తయారీ సంవత్సరం: 1827
- ఫ్రెంచ్ రాణి మేరీ ఆంటోయినెట్ కోసం దీన్ని తయారుచేశారని నమ్ముతారు.
- 1900 చివరలో ఈ గడియారాన్ని కొందరు దుండగులు దొంగలిచారు. ప్రస్తుతం ఇది ఎల్‌ఏ మేయర్ మ్యూజియంలో ఉంది.
5. జేగర్-లెకౌల్ట్రే జోయిలెరీ 101 మాన్చెట్
- ధర: రూ.216 కోట్లు
- ఉపయోగించిన పదార్థం: తెలుపు బంగారం
- తయారీ సంవత్సరం: 2012
- 777 వజ్రాలను ఇందులో అమర్చారు.
6. చోపార్డ్ 201- క్యారెట్
- ధర: రూ.208 కోట్లు
- ఉపయోగించిన పదార్థం: తెలుపు, పసుపు బంగారం
- తయారీ సంవత్సరం: 2000
- ఇది స్ప్రింగ్ లోడెడ్ మెకానిజమ్‌తో పని చేస్తుంది.
- సమయం తెలుసుకునేందుకు దానిపై నొక్కినప్పుడు మూడు గుండె ఆకారపు వజ్రాలు (15-క్యారెట్ గులాబీ రంగు, 12-క్యారెట్ నీలం రంగు, 11-క్యారెట్ తెలుపు రంగు) పూల రేకుల్లా విచ్చుకుంటాయి.
7. పటేక్ ఫిలిప్ హెన్రీ గ్రేవ్స్ సూపర్ కాంప్లికేషన్
- ధర: రూ.200 కోట్లు
- ఉపయోగించిన పదార్థం: బంగారం
- తయారీ సంవత్సరం: 1932
8. రోలెక్స్ పాల్ న్యూమన్ డేటోనా రెఫ్ 6239
- ధర: రూ.155 కోట్లు
- ఉపయోగించిన మెటీరియల్: స్టెయిన్లెస్ స్టీల్
- తయారీ సంవత్సరం: 1968
9. జాకబ్ & కో.బిలియనీర్ వాచ్
- ధర: రూ.150 కోట్లు
- ఉపయోగించిన పదార్థం: తెలుపు బంగారం
- తయారీ సంవత్సరం: 2015
ఇదీ చదవండి: వాట్సప్‌లో కొత్తమోసాలు.. జాగ్రత్తసుమా!
10. పటేక్ ఫిలిప్ స్టెయిన్లెస్ స్టీల్ రెఫ్ 1518
- ధర: రూ.100 కోట్లు
- ఉపయోగించిన మెటీరియల్: స్టెయిన్లెస్ స్టీల్
- తయారీ సంవత్సరం: 1943
Comments
Please login to add a commentAdd a comment