winter camp
-
Winter Travel Ideas: శీతాకాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు
దేశంలో చలివాతావరణం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ శీతాకాలంలో దేశంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి తరుణంలో ఆయా ప్రాంతాలకు వెళితే బిజీలైఫ్ నుంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది.మనదేశంలో శీతాకాలంలో సందర్శించదగిన అనేక ప్రదేశాలున్నాయి. అక్కడ చలిని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ప్రతీయేటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ ప్రాంతాల్లో టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆ ప్రాంతాలు ఏవి? ఎక్కడున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.గోవాప్రకృతి అందాలకు నిలయమైన గోవా.. స్వదేశీ, విదేశీ పర్యాటకుల గమ్యస్థానం. అందమైన సముద్రం, బీచ్, నైట్ లైఫ్, పార్టీలు, వినోదాన్ని ఇష్టపడేవారు వింటర్ సీజన్లో గోవాను సందర్శిస్తే మంచి అనుభూతి దొరుకుతుంది. గోవా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందింది. గోవాకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్లవచ్చు. లేదా ఒంటరిగా నైనా వెళ్లవచ్చు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గోవాలో అత్యంత రమణీయమైన వాతావరణం కనిపిస్తుంది.జైసల్మేర్శీతాకాలంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రకృతిశోయగాలతో మరింత సుందరంగా తయారవుతుంది. జైసల్మేర్‌లో చారిత్రక వారసత్వం, సంస్కృతి రెండూ కనిపిస్తాయి. ఇక్కడ క్యాంపింగ్, నైట్ అవుట్, ఒంటె సవారీ తదితర వినోద కార్యకలాపాల్లో పాల్గొని, ఎంజాయ్ చేయవచ్చు. చలికాలంలో జైసల్మేర్‌ను సందర్శించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు.కూర్గ్కర్ణాటకలో ఉన్న కూర్గ్ అధికారిక పేరు కొడగు. దీనిని స్కాట్లాండ్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. చలికాలంలో కూర్గ్‌లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం ఇక్కడి విశేషం. దేశమంతటా అత్యధిక చలివున్న సమయంలో కూర్గ్‌లో వెచ్చదనాన్ని అనుభవించవచ్చు. కూర్గ్‌లోని ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి.ముంబైవింటర్ సీజన్లో ముంబైని కూడా సందర్శించవచ్చు. ఇక్కడి బీచ్‌లో బలమైన అలలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముంబైలో సందర్శించేందుకు పలు పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్‌ను ఆహార ప్రియులను అమితంగా ఇష్టపడుతుంటారు. ముంబైలో సందర్శించేందుకు పలు పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ శీతాకాలంలో తక్కువ బడ్జెట్లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే అందుకు ముంబై అనువైన ప్రాంతమని పర్యాటకులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఆ మూడు పార్టీల బలాలు.. బలహీనతలు -
20న రాష్ట్రపతి కోవింద్ నగరానికి రాక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన ఈ నెల 20న హైదరాబాద్‌కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈనెల 20 నుంచి 22 వరకు బస చేయనున్నారు. 23న ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి చెన్నై లేదా పుదుచ్చెరి వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరువంతపురం వెళ్లనున్నారు. అక్కడ్నుంచి 26న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. మరుసటి రోజు 27న రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌హోం’కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ప్రముఖులను ఆహ్వానించనున్నారు. 28న మధ్యాహ్నం 3 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి సమీక్ష నిర్వహించనున్నారు. -
18న రాష్ట్రానికి రాష్ట్రపతి
* 31 వరకు బొల్లారంలో శీతాకాల విడిది * ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నెల 18న రాష్ట్రపతి శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రానున్నారు. రెండు వారాల పాటు (ఈ నెల 31) బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన విడిది చేస్తారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమీక్షించారు. విడిదికి అవసరమయ్యే ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో గురువారం సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్మీ, పోలీస్, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్, వైద్యం, ఆర్ అండ్‌బీ, సమాచార పౌర సంబంధాలు, ఎస్పీడీసీఎల్, ఏపీటీఎస్, బీఎస్ఎన్ఎల్, కంటోన్మెంట్, ఫైర్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటనకు వీలుగా హకీంపేట ఎయిర్‌పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. అన్నిచోట్ల బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల సిబ్బందికి డ్యూటీ పాసులు జారీ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. రాష్ట్రపతి ప్రయాణించే మార్గాలలో రోడ్లకు మరమ్మతులు, స్వాగత తోరణాలు, అవసరమైన హెలీప్యాడ్ ఏర్పాటు, బారికేడ్ల నిర్మాణంతోపాటు పరిసరాల పరిశుభ్రతకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని శాఖల సమన్వయానికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల డీఆర్వోలు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రపతి నిలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు, అవసరమైన మరమ్మతులు, తాగునీటి సరఫరా, విద్యుదీకరణ, పుష్పాలంకరణ, టెలిఫోన్, కంప్యూటర్, ప్రింటర్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. చండీ యాగానికి రాష్ట్రపతి: హైదరాబాద్‌లో విడిది సందర్భంగా రాష్ట్రపతి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. డిసెంబర్ 19న మిలిటరీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ స్నాతకోత్సవంలో, 27న ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో పాల్గొంటారు. ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే అయుత చండీయాగంలో పాల్గొంటారు. ఈ పర్యటనల దృష్ట్యా అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ అధికారులకు సూచించారు. జీఏడీ ముఖ్య కార్యదర్శి అదర్‌సిన్హా, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఐజీ అంజనీకుమార్, మహేశ్ భగవత్, కంటోన్మెంట్ బోర్డు సీఈవో సుజాత గుప్తా, ప్రొటోకాల్ డెరైక్టర్ అర్వీందర్‌సింగ్, సమాచార శాఖ డెరైక్టర్ వి.సుభాష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
రాష్ట్రపతి తేనీటి విందు