
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన ఈ నెల 20న హైదరాబాద్‌కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈనెల 20 నుంచి 22 వరకు బస చేయనున్నారు. 23న ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి చెన్నై లేదా పుదుచ్చెరి వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరువంతపురం వెళ్లనున్నారు. అక్కడ్నుంచి 26న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. మరుసటి రోజు 27న రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌హోం’కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ప్రముఖులను ఆహ్వానించనున్నారు. 28న మధ్యాహ్నం 3 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి సమీక్ష నిర్వహించనున్నారు.