మేకప్‌లో మెరుస్తూ...
చలికాలం ఉక్కపోత ఉండదు, మేకప్ చెదిరిపోదు, బాగుంటుంది అనుకుంటారు. అయితే, ప్రతి సీజన్‌కి బ్యూటీ చాలెంజెస్ ఉంటాయి. చలికాలంలో చేయించుకోదగిన ఫేషియల్స్, మేకప్, ఫుడ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వివాహ వేడుకలకు మేకప్ చేయించుకునేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే, సరైన ప్రయోజనాలను పొందుతారు.
పొడిగా ఉన్నా, జిడ్డుగా ఉన్నా చలి కాలం మేకప్ చేసేముందు హైడ్రేటెడ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. లేదంటే, మేకప్ కూడా డ్రైగా కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి ప్రైమరీ లోషన్ వాడుకోవచ్చు.
మెరిసే చర్మానికి..
చర్మం మెరుస్తున్నట్టుగా ఆరోగ్యంగా కనిపించాలంటే నూనె శాతం ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్‌ని ముందు ఉపయోగిస్తే మాయిశ్చరైజర్‌ని స్కిన్ మీద పట్టి ఉంచుతుంది. దీని వల్ల మేకప్ డ్రైగా కనిపించదు. బడ్జెట్‌ని బట్టి సీరమ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో చర్మానికి అవసరమయ్యే గుణాలు ఏవి ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. సాధారణంగా చర్మం సహజ ఆయిల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. కానీ, వయసు పెరుగుతున్నకొద్దీ సహజ నూనెల ఉత్పత్తి ఆగి΄ోతుంది. దాంతో చర్మం ΄÷డిబారుతుంది. చలికాలం పెళ్లిళ్లు ఉన్న బ్రైడల్స్ అయితే కనీసం నెల ముందు నుంచి స్కిన్ కేర్ తీసుకోవాలి.
హెల్తీ స్కిన్‌కి పోషకాహారం
స్కిన్ కేర్ తీసుకోకుండా పెళ్లిరోజు మేకప్ చేయించుకుంటే హెల్తీగా కనిపించదు. నెల రోజుల ముందు నుంచి హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్స్ ఉపయోగించాలి. ΄ోషకాహారం, ΄ానీయాల మీద దృష్టి పెట్టాలి. జంక్ ఫుడ్, మాంసాహారం కాకుండా పండ్లు, కూరగాయలు, జ్యూసులను ఆహారంలో ఎక్కువ చేర్చుకోవాలి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.
మేకప్‌కి ముందు
మేకప్‌కి ముందు ఎంజైమ్ స్క్రబ్ ఉపయోగిస్తారు. తర్వాత సీరమ్స్, అవసరమైతే షీట్ మాస్క్‌లు, అండర్ ఐ ప్యాచెస్ వాడుతారు. దీని వల్ల మేకప్ ప్యాచ్‌లుగా కనిపించదు.
మేకప్ తీయడానికి తప్పనిసరి
రిమూవర్స్ ఉపయోగించుకోవచ్చు. లేదంటే కొబ్బరినూనె, బాదం నూనె, బేబీ ఆయిల్ ను ఉపయోగించి మేకప్‌ను పూర్తిగా తీసేయాలి. తర్వాత ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలసి΄ోయామనో, మరుసటి రోజు చూడచ్చులే అనో మేకప్ తీసేయకుండా అలాగే పడుకుంటే స్కిన్ బాగా దెబ్బతింటుంది. చర్మం ఇంకా పొడిబారడం, యాక్నె వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు.
మేలైన ఫేషియల్స్
చలికాలంలో రొటీన్ ఫేషియల్స్ కాకుండా హైడ్రా ఫేషియల్ చేయించుకోవడం మంచిది. దీని వల్ల చర్మం నిగారింపు కోల్పోదు. వీటితో పాటు కొన్ని కెమికల్ పీల్స్ ఉంటాయి. అయితే, వీటిని పెళ్లికి పది రోజుల ముందు చేయించుకోవాలి. కెమికల్ పీల్‌ని బ్యూటీపార్లర్‌లో కాకుండా చర్మనిపుణుల సమక్షంలో చేయించుకోవడం మంచిది.
– విమలారెడ్డి పొన్నాల,
సెలబ్రిటీ అండ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్
Comments
Please login to add a commentAdd a comment