శీతాకాలంలో చర్మం, ముఖం సౌందర్య పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలి. రసాయనాలులేని సహజ పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్నిమెరుగు పర్చు కోవడానికి ప్రయత్నించాలి. చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడంలోనూ పెసలు చక్కగా పని చేస్తాయి. ఈ నేపథ్యంలో పెసర పిండితో కొన్ని చిట్కాలను ఇపుడు చూద్దాం!
టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.
పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.
పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.
టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.
ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు.
Comments
Please login to add a commentAdd a comment