facial beauty
-
చలికాలంలో మేకప్, ఈ జాగ్రత్తలు తప్పదు.. లేదంటే!
చలికాలం ఉక్కపోత ఉండదు, మేకప్ చెదిరిపోదు, బాగుంటుంది అనుకుంటారు. అయితే, ప్రతి సీజన్‌కి బ్యూటీ చాలెంజెస్ ఉంటాయి. చలికాలంలో చేయించుకోదగిన ఫేషియల్స్, మేకప్, ఫుడ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వివాహ వేడుకలకు మేకప్ చేయించుకునేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే, సరైన ప్రయోజనాలను పొందుతారు. పొడిగా ఉన్నా, జిడ్డుగా ఉన్నా చలి కాలం మేకప్ చేసేముందు హైడ్రేటెడ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. లేదంటే, మేకప్ కూడా డ్రైగా కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి ప్రైమరీ లోషన్ వాడుకోవచ్చు.మెరిసే చర్మానికి..చర్మం మెరుస్తున్నట్టుగా ఆరోగ్యంగా కనిపించాలంటే నూనె శాతం ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్‌ని ముందు ఉపయోగిస్తే మాయిశ్చరైజర్‌ని స్కిన్ మీద పట్టి ఉంచుతుంది. దీని వల్ల మేకప్ డ్రైగా కనిపించదు. బడ్జెట్‌ని బట్టి సీరమ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో చర్మానికి అవసరమయ్యే గుణాలు ఏవి ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. సాధారణంగా చర్మం సహజ ఆయిల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. కానీ, వయసు పెరుగుతున్నకొద్దీ సహజ నూనెల ఉత్పత్తి ఆగి΄ోతుంది. దాంతో చర్మం ΄÷డిబారుతుంది. చలికాలం పెళ్లిళ్లు ఉన్న బ్రైడల్స్ అయితే కనీసం నెల ముందు నుంచి స్కిన్ కేర్ తీసుకోవాలి.హెల్తీ స్కిన్‌కి పోషకాహారంస్కిన్ కేర్ తీసుకోకుండా పెళ్లిరోజు మేకప్ చేయించుకుంటే హెల్తీగా కనిపించదు. నెల రోజుల ముందు నుంచి హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్స్ ఉపయోగించాలి. ΄ోషకాహారం, ΄ానీయాల మీద దృష్టి పెట్టాలి. జంక్ ఫుడ్, మాంసాహారం కాకుండా పండ్లు, కూరగాయలు, జ్యూసులను ఆహారంలో ఎక్కువ చేర్చుకోవాలి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.మేకప్‌కి ముందుమేకప్కి ముందు ఎంజైమ్ స్క్రబ్ ఉపయోగిస్తారు. తర్వాత సీరమ్స్, అవసరమైతే షీట్ మాస్క్‌లు, అండర్ ఐ ప్యాచెస్ వాడుతారు. దీని వల్ల మేకప్ ప్యాచ్‌లుగా కనిపించదు.మేకప్ తీయడానికి తప్పనిసరిరిమూవర్స్ ఉపయోగించుకోవచ్చు. లేదంటే కొబ్బరినూనె, బాదం నూనె, బేబీ ఆయిల్ ను ఉపయోగించి మేకప్‌ను పూర్తిగా తీసేయాలి. తర్వాత ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలసి΄ోయామనో, మరుసటి రోజు చూడచ్చులే అనో మేకప్ తీసేయకుండా అలాగే పడుకుంటే స్కిన్ బాగా దెబ్బతింటుంది. చర్మం ఇంకా పొడిబారడం, యాక్నె వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మేలైన ఫేషియల్స్చలికాలంలో రొటీన్ ఫేషియల్స్ కాకుండా హైడ్రా ఫేషియల్ చేయించుకోవడం మంచిది. దీని వల్ల చర్మం నిగారింపు కోల్పోదు. వీటితో పాటు కొన్ని కెమికల్ పీల్స్ ఉంటాయి. అయితే, వీటిని పెళ్లికి పది రోజుల ముందు చేయించుకోవాలి. కెమికల్ పీల్ని బ్యూటీపార్లర్‌లో కాకుండా చర్మనిపుణుల సమక్షంలో చేయించుకోవడం మంచిది. – విమలారెడ్డి పొన్నాల, సెలబ్రిటీ అండ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ -
పోర్టబుల్ ఫేషియల్ మసాజర్
నలుగురిలోనూ నేచురల్‌గా కనిపించడానికి తపించే మహిళలు సౌందర్య సాధన కోసం ఇలాంటి మసాజర్లనే ఎంచుకుంటూ ఉంటారు. లేటెస్ట్ వర్షన్లో దొరికే ఈ స్కిన్‌కేర్ డివైస్ చక్కగా ఉపయోగపడుతుంది. త్రీ మోడ్స్‌తో రూపొందిన ఈ ఫేషియల్ మసాజర్.. 4 ఇన్ 1 మసాజ్ ఫంక్షన్‌తో పనిచేస్తుంది. ఆటోమేటిక్ స్విచ్ మోడ్స్.. నార్మల్, కూలింగ్, హీటింగ్ అనే ఆప్షన్స్‌తో పని చేస్తుంది. చిత్రంలోని ఈ ఎలక్ట్రిక్ ఫేషియల్ మసాజర్.. ప్రతి 3 నిమిషాలకు ఇంటెలిజెంట్ మోడ్స్‌ని మారుస్తుంది. మొత్తం తొమ్మిది నిమిషాలు నిర్విరామంగా ట్రీట్మెంట్ అందిస్తుంది.దీన్ని వాడిన తర్వాత.. మెత్తటి క్లాత్‌తో క్లీన్ చేసుకోవచ్చు. జెల్, క్రీమ్, ఎసెన్స్, లోషన్స్ ఏవైనా అప్లై చేసుకుని.. ఆపై ఈ డివైస్‌తో మసాజ్ చేసుకోవాలి. ఈ పోర్టబుల్ – ఫేస్ కేర్ మసాజర్.. సౌందర్య సాధనాల బ్యాగ్‌లో ప్యాక్ చే సుకోవడానికి వీలుగా ఉంటుంది. దీన్ని వినియోగిస్తే చర్మం బిగుతుగా మారుతుంది. యవ్వనంగా సహజమైన మెరుపును సొంతం చేసుకోవచ్చు. మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది ఇంట్లో ఉంటే పార్లర్ స్పా అనుభూతిని అందిస్తుంది. దీనికి చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకోవచ్చు. దీని ధర 199 డాలర్లు. 16,700 రూపాయలు. -
బ్యూటీ టిప్స్: వేపాకుల పేస్ట్‌తో ఆ సమస్య తగ్గిపోతుంది
బ్యూటీ టిప్స్ ► టీ స్పూన్ పచ్చిపాలలో అయిదారు చుక్కల తులసి రసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ ముంచి ముఖానికి, మెడకి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు తగ్గి ముఖం పొడిబారకుండా ఉండి చర్మం నిగనిగలాడుతుంది. ► ఒక టేబుల్ స్పూన్ కోకో బటర్‌కి రెండు టేబుల్ స్పూన్ల రోజ్‌వాటర్‌ని కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ని ఫేస్‌కి ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ఫేస్‌వాష్ చేసుకోవాలి. ► ముఖంపై మొటిమలు, మచ్చలతో బాధపడుతుంటే వేపాకులు బెస్ట్ సొల్యూషన్. వేపాకుల పొడిలో పసుపు, రోజ్‌వాటర్ కలుపుకొని ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. ► కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది. -
క్షణాల్లో ఫేస్‌మాస్క్‌ను రెడీ చేసే మెషీన్.. కొరియన్లు చేసేది ఇదే
నిజానికి ఫేస్ మాస్క్‌లతో స్కిన్ కేర్ పొందడం మంచి ప్రయత్నమే. కానీ వాటిని సిద్ధం చేసుకోవడమే కష్టం. ఆ కష్టాన్ని సులభతరం చేస్తుంది ఈ లేటెస్ట్ ఫేస్ మాస్క్ డివైస్. ఇంట్లో తయారు చేసుకునే సాధారణ ఫేస్ మాస్క్ వేసుకుంటే.. అప్లై చేసుకునే సమయంలో ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువవుతుంది. కొన్నిసార్లు సగం ఆరి.. సగం ఆరక ఇబ్బందవుతుంది. గుజ్జుమెత్తగా లేకుంటే ఉండాల్సిన సమయం కంటే ముందే రాలిపోతుంది. ఇలా ఒక్కటని కాదు.. ఫేస్ మాస్క్ విషయంలో అన్నీ సమస్యలే. అదే ఈ మెషిన్‌తో తయారైన మాస్క్‌ని క్లాత్ మాదిరి పట్టుకుని.. ముఖంపై సమాంతరంగా సులభంగా పరచుకోవచ్చు. పైగా ఈ మెషిన్ని మనం క్లీన్ చెయ్యాల్సిన పనిలేదు. సెల్ఫ్ క్లీనింగ్ మోడ్ ఆన్ చేస్తే పది సెకన్లలో క్లీన్ అయిపోతుంది. దీనికి చార్జింగ్ పెట్టుకుని.. వైర్‌లెస్‌గా వాడుకోవచ్చు. ఎన్ని నీళ్లు పొయ్యాలి.. ఇన్‌గ్రీడియెంట్స్ ఏ మోతాదులో కలపాలి.. అనే సూచనలను వాయిస్ మోడ్‌లో ఇస్తూంటుంది ఈ మేకర్. అవసరం లేదనుకుంటే వాయిస్ రిమైండర్ ఆపేసుకోవచ్చు. ఇది సరిగ్గా రెండు నిమిషాల్లో మాస్క్కి కావాల్సిన పేస్ట్‌ని సిద్ధం చేస్తుంది. ఇందులో కూరగాయలు, పండ్లు, విటమిన్ టాబ్లెట్స్ వంటివి పేస్ట్‌లా చేసుకోవచ్చు. దీని ధర సుమారుగా 6 వేలరూపాయల పైమాటే. మాస్క్ ప్లేట్స్‌ని బట్టి.. అందులో లిక్విడ్ వేయగానే ఆయా షేప్ మాస్క్‌లు సిద్ధమవుతాయి. కళ్లు, ముక్కు, పెదవులకు ఇబ్బంది లేకుండా రూపొందిన ఫేస్ షేప్‌లో ఉండే ప్లేట్‌తో పాటు.. కళ్లు, ముక్కు, పెదవుల ఆకారంలో ఉండే ప్లేట్స్ కూడా డివైస్‌తో పాటు లభిస్తాయి. ఈ సౌకర్యాలన్నింటిని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. -
ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోవడం ఖాయం
ఎప్పుడూ జిడ్డు కారుతూ, మచ్చలతో, వడిలిపోయినట్లు ఉండే చర్మానికి.. ఇట్టే చెక్ పెట్టాలా? కోమలమైన, కాంతిమంతమైన సౌందర్యం మీ సొంతం కావాలా? అయితే ఈ ‘ఫేస్‌జిమ్ 2 ఇన్ 1 మైక్రోనీడ్లింగ్ ఎలక్ట్రిక్ డివైస్’ని వెంట పెట్టుకోవాల్సిందే. దీన్ని ఉపయోగిస్తే ముఖం మిలమిలా మెరిసిపోతుంది. పొడి చర్మం, సాధారణ చర్మం, జిడ్డు చర్మం.. ఇలా అన్ని రకాల చర్మాలకు ఇది చక్కటి వైద్యాన్ని అందిస్తుంది. ఈ మెషిన్.. ముఖం మీదున్న డార్క్ స్పాట్స్, ఫేస్ డల్‌నెస్‌ని దూరం చేస్తుంది. అలాగే చర్మంపైన ముడతలు, గుంతలను కూడా పూర్తిగా నయం చేస్తుంది. ఈ డివైస్‌తో పాటు లిక్విడ్ విటమిన్ రీఫిల్స్ లభిస్తాయి. అవసరాన్ని బట్టి వాటిని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ లిక్విడ్స్‌లో గ్లైకోలిక్ యాసిడ్, విటమిన్ ఎఫ్ వంటివి మంచి ఫలితాలను అందిస్తాయి. గ్లైకోలిక్ యాసిడ్‌తో ముఖం కాంతిమంతమవుతుంది. విటమిన్ ఎఫ్‌తో మచ్చలు, ముడతలు మాయమవుతాయి. ఈ ఫేస్షాట్ ఎలక్ట్రిక్ మైక్రోనీడ్లింగ్ మెషిన్.. చర్మాన్ని రిజువనేట్ చేస్తుంది. దీని సీరం డిస్పెన్సర్ ట్రీట్మెంట్.. ముఖంలోని కండరాలను ఉత్తేజపరచడంలో.. స్కిన్‌ను మృదువుగా, బిగుతుగా మార్చడంలో సహకరిస్తుంది. మెడికల్–గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ డివైస్‌లో లిక్విడ్స్‌ని ఎలా నింపుకోవాలంటే.. చిత్రంలోని రీఫిల్స్‌ని.. ఇంజెక్షన్ బాటిల్ మాదిరి పైభాగాన్ని ఓపెన్ చేసి.. అందులోని లిక్విడ్‌ని డివైస్‌కి సంబంధించిన టూల్లో నింపుకోవాలి. దాన్ని మెషిన్ హెడ్లోకి జొప్పించి.. మూత బిగించి.. ఫేస్‌కి దాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పాడైన చర్మాన్ని ఇది 97 శాతం వరకూ తిరిగి యథాస్థితికి తేగలదు. సరిగ్గా నెల పాటు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దీని ధర 275 డాలర్లు. అంటే 22 వేల 780 రూపాయలన్న మాట. -
కాస్మొటిక్ సర్జరీతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి
-
హ్యాండ్‌బ్యాగ్‌లో పట్టే ఈ ఫేషియల్ డివైజ్‌తో శాశ్వత మెరుపు.. ధర 2,476
Beauty Tips In Telugu: స్పెషల్ డేస్‌లో స్పెషల్‌గా రెడీ అయ్యేందుకు ఖరీదైన ఫేషియల్స్, ఫేస్ ప్యాక్స్, మేకప్ కోసం చూస్తుంటారు చాలా మంది. అయితే అవి తెచ్చే మెరుపు తాత్కాలికమనే నిజాన్ని మరచిపోతుంటారు. తాత్కాలిక అందం కోసం అలా వ్యయప్రయాసలు పడేకంటే శాశ్వతమైన కాంతి కోసం ఈ మల్టీ ఫంక్షనల్ ఎలక్ట్రిక్ మసాజర్ (2 ఇన్ 1 ఫేస్ మసాజర్ అండ్ వాషింగ్ బ్రష్)ను ఉపయోగించి చూడండి.. స్కిన్–ఫ్రెండ్లీ సిలికాన్‌తో రూపొందిన ఈ ఫేషియల్ డివైజ్.. ముఖాన్ని శుభ్రం చేయడంతో పాటు.. మసాజ్ చేస్తూ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనిలోని గుండ్రటి డబుల్ సైడ్ బ్రష్‌ను(చిత్రంలో గమనించొచ్చు) తీసేసి.. మిగిలిన టూల్‌తో కళ్ల చుట్టూ మసాజ్ చేసుకోవడానికి ఉపయోగించొచ్చు. ఈ హ్యాండ్‌హెల్డ్ డిటాచబుల్ ఫేషియల్‌కి ఒక గంట పాటు చార్జింగ్ పెడితే సరిపోతుంది. ల్యాప్‌టాప్, పవర్ బ్యాంక్ ఇలా దేనితోనైనా సులభంగా చార్జర్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని రోజూ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రయాణాల్లో ముఖం శుభ్రం చేసుకోవడానికి, మసాజ్ చేసుకోవడానికి ఈ డివైజ్ చాలా ఈజీగా ఉంటుంది. దీని ధర సుమారుగా 32 డాలర్లు. అంటే 2,476 రూపాయలు మాత్రమే. పైగా ఇది హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకునేంత చిన్నదిగా, కంఫర్టబుల్‌గా ఉంటుంది. చదవండి : Body Fit Jacket: ప్రసవానంతర రికవరీకి బాగా ఉపయోగపడుతుంది.. ధర వెయ్యి లోపే! -
మచ్చలేని బ్యాక్
పండగ సీజన్.. ఆ తర్వాత పెళ్లిళ్ళ సీజన్.. వేడుకలకు ముగింపు అంటూ లేదు. పాశ్చాత్యమైన, సంప్రదాయమైన ఏ వేడుకైనా వేసుకునే దుస్తుల్లో లో బ్యాక్, బ్యాక్‌లెస్ బ్లౌజ్‌లు, గౌన్లు ధరిస్తుంటుంది యువత. ఇలాంటప్పుడు వీపు భాగం మచ్చలు లేకుండా నునుపుగా, మెరుపుగా ఉండాలంటే తప్పనిసరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. బ్యాక్ ఫేసియల్ వర్క్స్ ►కొన్ని గంటల పాటు వీపుభాగం కాంతివంతంగా కనిపించాలంటే ముఖానికి మాదిరిగా బ్యాక్ ఫేసియల్ చేయించడం సరైన ఎంపిక. బ్యాక్ మసాజ్ వల్ల కండరాలు విశ్రాంతి పొందడం వల్ల కూడా చర్మకాంతి పెరుగుతుంది ►పార్టీ లేదా ఏదైనా వేడుకకు ముందు క్లెన్సింగ్, స్క్రబ్బింగ్, మసాజ్ వంటివి చేయించడం, డి–ట్యాన్ ఉత్పాదనలు వాడటం వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఈ విధానం వల్ల నిస్తేజంగా మారిన మృతకణాలు చర్మం నుంచి దూరమై మేనికాంతి పెరుగుతుంది. ►పిగ్మెంటేషన్: యాక్నె, మొటిమలు, పిగ్మెంటేషన్ వల్ల అవి తగ్గినా ఆ తర్వాత చర్మంపై మచ్చలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు వైద్యుల సూచనల తీసుకొని చర్మకాంతి ఉత్పాదనలు వాడడమైనా, చికిత్స అయినా చేయించుకోవడం మంచిది. ►కెమికల్ పీల్: కొన్ని చర్మసమస్యలకు రసాయనాలను ఉపయోగించే చేసే చికిత్స మెరుగైన ఫలితాలను ఇవ్వచ్చు. పార్టీ లేదా వేడుకకు వారం రోజుల ముందుగానే కెమికల్ పీలింగ్ చేయించుకోవడం వల్ల సరైన ఫలితాన్ని పొందవచ్చు. ఇందుకు చర్మ సంబంధ వైద్యల సూచన తీసుకోవడం తప్పనిసరి. నానమ్మ కాలం నాటి విధానాలు వెనుకటి రోజుల్లో ఇంట్లోనే కొన్ని సౌందర్య ఉత్పాదనలు తయారుచేసుకొని చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేవారు. ►పసుపులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికిని కూడా వదిలించగలవు. మీగడలో పసుపు, తేనె కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేసుకొని దానిని వీపుకు పట్టించాలి. వేళ్లతో 2–3 నిమిషాలు మృదువుగా మర్దన చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మకాంతిలో వచ్చే మార్పులు మీరే గమనిస్తారు ►బంగాళదుంపను తురిమి ఆ మిశ్రమంతో వీపుభాగాన్ని రుద్దాలి. ఇది చర్మకాంతికి త్వరితమైన ఫలితాన్ని సూచిస్తుంది ►సహజసిద్ధమైన స్క్రబ్‌తో మెరుగైన ఫలితాలను పొందవచ్చు. అందుకు నిమ్మరసం, పంచదార పలుకులు కలిపి వీపుకు పట్టించి, మృదువుగా రుద్దాలి. దీని వల్ల చర్మంపై ఉన్న మృతకణాల సంఖ్య తగ్గుతుంది. చర్మం రంగు పెరగడానికి బ్లీచ్‌లా సహాయపడుతుంది ►మరొక మేలైన మిశ్రమం కాఫీ పొడి, తేనె. ఈ రెంటినీ కలిపి వీపు భాగానికి పట్టించి, 2–3 నిమిషాలు మృదువుగా రబ్ చేయాలి. తర్వాత కడిగేయాలి. -
తుమ్మితే రాలిపోని విషయాలు
ట్రివియా ⇒ ముక్కు. ఊపిరి తీసుకోవడానికి, వాసన చూడటానికి ఉపయోగపడుతుంది. ముఖసౌందర్యంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మనుషుల ముక్కుల్లో ప్రధానంగా పదిహేడు రకాలు ఉన్నట్లు ఒక తాజా సర్వేలో తేలింది. ⇒ మనుషుల్లో పదేళ్ల వయసు వచ్చేసరికి ముక్కు తన పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. అయితే, పురుషుల్లో 17-19 ఏళ్లు, మహిళల్లో 15-17 ఏళ్ల వరకు ముక్కు ఎదుగుదల కొనసాగుతుంది. ⇒ మనుషులు కనీసం పదివేలకు పైగా వాసనలను గుర్తించగలరు. ⇒ మనుషుల ముక్కులో ఆఘ్రాణశక్తిని ఇచ్చే కణాలు దాదాపు 1.20 లక్షల వరకు ఉంటాయి. అయితే, అందరి ఘ్రాణశక్తి ఒకేలా ఉండదు. ⇒ ఎలాంటి వాసనలను గుర్తించలేని పరిస్థితిని ‘అనోస్మియా’ అని, స్వల్పస్థాయిలోని వాసనలను సైతం గుర్తించగల శక్తిని ‘హైపరోస్మియా’ అని అంటారు. ⇒ పురుషుల కంటే మహిళల్లోనే ఘ్రాణశక్తి ఎక్కువ. పసిపిల్లల్లోనూ ఘ్రాణశక్తి ఎక్కువగానే ఉంటుంది. పసిపిల్లలు వాసన ఆధారంగా తల్లులను గుర్తించగలుగుతారు. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ మనుషుల్లో ఘ్రాణశక్తి క్రమంగా క్షీణిస్తుంది.. ⇒ కేవలం ముక్కుతోనే ఉపాధి పొందే వాళ్లు కూడా ప్రపంచంలో లేకపోలేదు. ఘనమైన ఘ్రాణశక్తి గల వారికి మద్యం ఉత్పత్తి సంస్థలు, పరిమళ ద్రవ్యాల ఉత్పత్తి సంస్థల్లో ప్రత్యేకమైన ఉద్యోగాలు ఉంటాయి. అలాంటి ఉద్యోగులు తమ ముక్కులకు బీమా చేయించుకుంటారు. ఇల్జా గోర్ట్ అనే డచ్ వైన్మేకర్ తన ముక్కును 80 లక్షల డాలర్లకు ఇన్సూర్ చేయించాడు. ⇒ ముక్కుకు ఎంతటి ఆఘ్రాణశక్తి ఉన్నా, ఇంధనంగా వాడే సహజ వాయువు ఉనికిని పసిగట్టలేదు. దీనివల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉండటంతో గ్యాస్ కంపెనీలు ఇందులో వాసన కలిగించే పదార్థాన్ని కలుపుతారు. -
ప్యాక్‌ల కన్నా జ్యూస్‌లు మేలు...
చర్మసౌందర్యాన్ని పెంచే ప్యాక్‌లు రెండు రకాలు. ఒకటి- మిశ్రమాన్ని ముఖంపైన పూయడం. రెండు- రకరకాల పండ్లను మరికొన్ని పండ్లతో కలిపి తినడం. ప్రూట్ ప్యాక్ వేసుకుంటే ముఖసౌందర్యం పెరుగుతుందో లేదో గాని పోషకవిలువలు సమృద్ధిగా ఉన్న సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు తినడం వల్ల మాత్రం నూటికి నూరు శాతం చర్మకాంతి పెరుగుతుంది. అవేంటో చూద్దాం... బొప్పాయి చాలావరకు బొప్పాయిని ఫేసియల్ స్క్రబ్‌గా ఉపయోగిస్తుంటారు. కాని తింటున్నారా?! బొప్పాయిలో విటమిన్-ఎ, సి ఉంటుంది. ఇది చర్మంలోని మలినాలను తొలగించడానికి సహాయపడతుంది. చర్మాన్ని కాంతిమంతంగా, బిగుతుగా మారుస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మంపై దద్దుర్లు, ఎరుపుదనం వంటివి తగ్గిస్తుంది. ఇలా చేయండి: బొప్పాయిగుజ్జులో బాదంపాలు, తేనె కలిపి తినాలి. లేదా బొప్పాయి ముక్కలు, క్యారట్ ముక్కలు, చేప ముక్కలను కలిపి సలాడ్‌లా తీసుకోవచ్చు. కొబ్బరి కెఫిర్ కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటామన్న విషయం తెలుసు. హార్మోన్లలో హెచ్చుతగ్గులను నివారించి, చర్మకాంతిని పెంచే గుణాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇలా చేయండి: లేత కొబ్బరినీళ్లు, కెఫిర్ (పెరుగులా ఉంటుంది. మార్కెట్లో లభిస్తుంది) ను కలిపి తయారుచేసిన పానీయాన్ని రోజూ పరగడుపున తాగితే చర్మకాంతి రెట్టింపు అవుతుంది. బీట్రూట్ చర్మంలోని మలినాలను తొలగించడంలో బీట్రూట్ బాగా పనిచేస్తుంది. అంతేకాదు మనం తీసుకునే ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. 400 శాతం రక్తవృద్ధి కలుగుతుంది. ఫలితంగా చర్మకాంతి పెరుగుతుంది. ఇలా చేయండి: 16 ఔన్సుల బీట్రూట్ జ్యూస్ తాగితే 12 గంటల్లో చర్మకాంతి పెరుగుతుంది. పచ్చి బీట్రూట్ను పాలకూర సలాడ్‌తో కలిపి తీసుకోవచ్చు. నిమ్మ నిమ్మరసం తాగడం వల్ల చర్మంలోని టాక్సిన్లు విడుదలవుతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చర్మం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. నోటిలోని బ్యాక్టీరియాను నివారిస్తుంది. యాక్నె సమస్యను పోగొడుతుంది. సౌందర్య ప్రపంచంలో దీనిని మించిన బ్యూటీ టిప్ లేదు. ఇలా చేయండి: ఉదయం అర చెక్క నిమ్మకాయ జ్యూస్‌ను, గ్లాసుడు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్‌తో డ్రెస్సింగ్ చేసిన సలాడ్స్ తీసుకుంటే మరీ మంచిది. రెడ్ క్యాబేజీ దీనిలో ఉండే ఫెటో న్యూట్రియంట్లు చర్మంపై ముడతలను నివారిస్తాయి. పిగ్మెంటేషన్, దద్దుర్లను నివారించే గుణాలు రెడ్ క్యాబేజీలో పుష్కలంగా ఉన్నాయి. ఇలా చేయండి: ప్రతి రోజూ రెడ్ క్యాబేజీ తరుగు, క్యారట్ తరుగు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి సలాడ్ చేసి, తినాలి. ఇలా 21 రోజుల పాటు తింటే పదేళ్ల వయసు తగ్గినట్టు, యవ్వనంగా కనిపిస్తారు. టొమాటో జ్యూస్ రోజును తాజా టొమాటో రసంతో ప్రారంభించండి. టొమాటోలో ఉండే లైకోపిన్ సూర్యరశ్మి నుంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల చర్మానికి కలిగే హానిని నివారిస్తుంది. రోజూ గ్లాస్ టొమాటో జ్యూస్ తాగడం వల్ల నిస్తేజంగా మారిన చర్మానికి జీవం కలిగిస్తుంది. ఇలా చేయండి: రసాయన మందులు వాడకుండా సహజమైన పద్ధతులో పండించిన టొమాటోతో తయారుచేసుకున్న జ్యూస్‌ను సేవించడం మేలు. పుచ్చకాయ టొమాటో జ్యూస్‌లలో సన్ ప్రొటెక్షన్ సుగుణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి వీటిలో ఏ జ్యూస్ అయినా సేవించవచ్చు.