హ్యాండ్‌బ్యాగ్‌లో పట్టే ఈ ఫేషియల్‌ డివైజ్‌తో శాశ్వత మెరుపు.. ధర 2,476 | Beauty Tips: 2 In 1 Face Massager And Washing Brush Permanent Glow | Sakshi
Sakshi News home page

Beauty Tips: హ్యాండ్‌బ్యాగ్‌లో పట్టేంత చిన్న డివైజ్‌తో శాశ్వత మెరుపు.. ధర 2,476

Published Mon, May 23 2022 1:35 PM | Last Updated on Mon, May 23 2022 1:44 PM

Beauty Tips: 2 In 1 Face Massager And Washing Brush Permanent Glow - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Beauty Tips In Telugu: స్పెషల్‌ డేస్‌లో స్పెషల్‌గా రెడీ అయ్యేందుకు ఖరీదైన ఫేషియల్స్, ఫేస్‌ ప్యాక్స్, మేకప్‌ కోసం చూస్తుంటారు చాలా మంది. అయితే అవి తెచ్చే మెరుపు తాత్కాలికమనే నిజాన్ని మరచిపోతుంటారు. తాత్కాలిక అందం కోసం అలా వ్యయప్రయాసలు పడేకంటే శాశ్వతమైన కాంతి కోసం ఈ మల్టీ ఫంక్షనల్‌ ఎలక్ట్రిక్‌ మసాజర్‌ (2 ఇన్‌ 1 ఫేస్‌ మసాజర్‌ అండ్‌ వాషింగ్‌ బ్రష్‌)ను ఉపయోగించి చూడండి..

స్కిన్‌–ఫ్రెండ్లీ సిలికాన్‌తో రూపొందిన ఈ ఫేషియల్‌ డివైజ్‌.. ముఖాన్ని శుభ్రం చేయడంతో పాటు.. మసాజ్‌ చేస్తూ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనిలోని గుండ్రటి డబుల్‌ సైడ్‌ బ్రష్‌ను(చిత్రంలో గమనించొచ్చు) తీసేసి.. మిగిలిన టూల్‌తో కళ్ల చుట్టూ మసాజ్‌ చేసుకోవడానికి ఉపయోగించొచ్చు.

ఈ హ్యాండ్‌హెల్డ్‌ డిటాచబుల్‌ ఫేషియల్‌కి ఒక గంట పాటు చార్జింగ్‌ పెడితే సరిపోతుంది. ల్యాప్‌టాప్, పవర్‌ బ్యాంక్‌ ఇలా దేనితోనైనా సులభంగా చార్జర్‌ కనెక్ట్‌ చేసుకోవచ్చు. దీన్ని రోజూ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ప్రయాణాల్లో ముఖం శుభ్రం చేసుకోవడానికి, మసాజ్‌ చేసుకోవడానికి ఈ డివైజ్‌ చాలా ఈజీగా ఉంటుంది. దీని ధర సుమారుగా 32 డాలర్లు. అంటే 2,476 రూపాయలు మాత్రమే. పైగా ఇది హ్యాండ్‌ బ్యాగ్‌లో వేసుకునేంత చిన్నదిగా, కంఫర్టబుల్‌గా ఉంటుంది. 

చదవండి : Body Fit Jacket: ప్రసవానంతర రికవరీకి బాగా ఉపయోగపడుతుంది.. ధర వెయ్యి లోపే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement