పోర్టబుల్‌ ఫేషియల్‌ మసాజర్‌ | Portable Facial Massager | Sakshi
Sakshi News home page

పోర్టబుల్‌ ఫేషియల్‌ మసాజర్‌

Published Sun, Sep 22 2024 8:26 AM | Last Updated on Sun, Sep 22 2024 8:26 AM

Portable Facial Massager

నలుగురిలోనూ నేచురల్‌గా కనిపించడానికి తపించే మహిళలు సౌందర్య సాధన కోసం ఇలాంటి మసాజర్లనే ఎంచుకుంటూ ఉంటారు. లేటెస్ట్‌ వర్షన్‌లో దొరికే ఈ స్కిన్‌కేర్‌ డివైస్‌ చక్కగా ఉపయోగపడుతుంది. 

త్రీ మోడ్స్‌తో రూపొందిన ఈ ఫేషియల్‌ మసాజర్‌.. 4 ఇన్‌ 1 మసాజ్‌ ఫంక్షన్‌తో పనిచేస్తుంది. ఆటోమేటిక్‌ స్విచ్‌ మోడ్స్‌.. నార్మల్, కూలింగ్, హీటింగ్‌ అనే ఆప్షన్స్‌తో పని చేస్తుంది. 

చిత్రంలోని ఈ ఎలక్ట్రిక్‌ ఫేషియల్‌ మసాజర్‌..  ప్రతి 3 నిమిషాలకు ఇంటెలిజెంట్‌ మోడ్స్‌ని మారుస్తుంది. మొత్తం తొమ్మిది నిమిషాలు నిర్విరామంగా ట్రీట్‌మెంట్‌ అందిస్తుంది.

దీన్ని వాడిన తర్వాత.. మెత్తటి క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవచ్చు. జెల్, క్రీమ్, ఎసెన్స్, లోషన్స్‌ ఏవైనా అప్లై చేసుకుని.. ఆపై ఈ డివైస్‌తో మసాజ్‌ చేసుకోవాలి. ఈ పోర్టబుల్‌ – ఫేస్‌ కేర్‌ మసాజర్‌.. సౌందర్య సాధనాల బ్యాగ్‌లో ప్యాక్‌ చే సుకోవడానికి వీలుగా ఉంటుంది. దీన్ని వినియోగిస్తే చర్మం బిగుతుగా మారుతుంది. 

యవ్వనంగా సహజమైన మెరుపును సొంతం చేసుకోవచ్చు. మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది ఇంట్లో ఉంటే పార్లర్‌ స్పా అనుభూతిని అందిస్తుంది. దీనికి చార్జింగ్‌ పెట్టుకుని వినియోగించుకోవచ్చు. దీని ధర 199 డాలర్లు. 16,700 రూపాయలు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement