
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... ఖమ్మంలో గరిష్టంగా 32.6 డిగ్రీ సెల్సియస్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో కనిష్టంగా 7.1 డిగ్రీల సెల్సియస్ నమోద య్యాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని 9 మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదైనట్లు వాతా వరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. చదవండి: సిద్దిపేటలో సామూహిక గృహ ప్రవేశాలు
ప్రస్తుత సీజన్‌లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.6 డిగ్రీలు తక్కువ నమోదవుతుండగా.. గరిష్ట ఉష్ణోగ్రత 3.9డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. జిల్లా కేంద్రాలవారీగా ఉష్ణోగ్రతల నమోదును పరిశీలిస్తే.. నల్లగొండ మినహాయించి అన్నిచోట్లా గరిష్ట ఉష్ణోగ్రతలు 30డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అధికంగా ఖమ్మం 32.6 డిగ్రీలు, నిజామాబాద్ 32.4డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 10.6 డిగ్రీలు, మెదక్‌లో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment