కావలసినవి
చిన్నచిన్న ముక్కలుగా తరిగిన క్యారట్ + క్యాబేజి + బీన్స్ + బఠాణీ – 5 కప్పులు; బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి – 2 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; మిరియాల పొడి – ఒక టీ స్పూను; కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూను; పాలు – 2 టేబుల్ స్పూన్లు; కొత్తి మీర – కొద్దిగా; బటర్ – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత
తయారి
∙స్టౌ మీద బాణలి వేడి చేశాక, బటర్ వేసి కరిగించాలి ∙ఉల్లి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ∙కూర ముక్కలు, ఉప్పు జత చేసి మరో రెండు నిమిషాలు వేయించాలి ∙మూడు కప్పుల నీళ్లు జత చేసి, ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి ∙ఒక చిన్న గిన్నెలో పాలు, బియ్యప్పిండి వేసి బాగా కలిపి, ఉడుకుతున్న కూరముక్కలలో వేసి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి ∙మిరియాల పొడి, కొత్తిమీర జత చేస్తే, వేడి వేడి రైస్ ఫ్లోర్ సూప్ రెడీ అయినట్లే ∙బ్రెడ్ లేదా పావ్‌తో అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment