చలికాలం చర్మం పొడిబారుతుంది. సరైన పోషణ లేకపోతే చర్మంపైన తెల్లని పొట్టులా ఏర్పడుతుంటుంది. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే...
∙అరకప్పు గులాబీ రేకలను పేస్ట్ చేసి అందులో టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ పేస్ట్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలి. గులాబీల సుగంధం ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందేలా చేస్తుంది. కొబ్బరిపాలు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌ని ఇస్తాయి. చలికాలం ఉన్నన్ని రోజులు రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మ మృదువుగా, కాంతిమంతంగా ఉంటుంది.
∙రెండు టీ స్పూన్ల కోకా బటర్‌ను కరిగించి అందులో టీ స్పూన్ విటమిన్–ఇ ఆయిల్, టీ స్పూన్ నువ్వుల నూనె కలిపి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని శరీరానికి మసాజ్ చేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం మృదువుగా మారుతుంది.
∙టేబుల్ స్పూన్ తేనెలో, టీ స్పూన్ మీగడ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు, భుజాలకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్. ముఖ్యంగా చలికాలంలో.
∙మూడు బాదంపప్పులను రాత్రిపూట నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పై పొట్టు తీసి, మెత్తగా రుబ్బి, అందులో టేబుల్ స్పూన్ పచ్చి పాలు, ఆలివ్ ఆయిల్ కొద్దిగా కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతో పాటు చేతులు, పాదాలకు కూడా రాసుకొని పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత సున్నిపిండితో శుభ్రపరుచుకోవాలి. పొడిబారి నిస్తేజంగా ఉన్న చర్మం మృదువుగా, కాంతివంతం అవుతుంది.
∙ఉడికించిన ఒట్స్, తేనె బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ప్యాక్ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది పొడి చర్మం గలవారికి మేలైన ప్యాక్.
పొడిబారిన చర్మానికి...
Published Thu, Dec 6 2018 12:24 AM | Last Updated on Thu, Dec 6 2018 12:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment